Begin typing your search above and press return to search.
ఉన్నది పోయే..దాచుకున్నది పోయే..!
By: Tupaki Desk | 23 April 2020 2:30 PM GMTకరోనా మహమ్మారి ప్రభావం సినీ ఇండస్ట్రీపై ఏ రేంజ్ లో పడిందో అందరికీ తెలిసిందే. ప్రతి వారం ఏదొక కొత్త సినిమాతో కళకళలాడుతుండే సినిమా థియేటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ పరిస్థితులు చక్కబడకపోవడంతో మే నెల దాకా పొడిగించారు. పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పట్లో థియేటర్లలోకి వచ్చేలా కనబడటం లేదు. అంతేకాకుండా కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా నెలకొని ఉన్న పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఈ ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ప్రతీ ఇంట్లో అడుగు పెట్టేశాయి. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కి క్రేజ్ బాగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. వీటి కారణంగా చిత్ర పరిశ్రమలో రాబోయే రోజుల్లో చాలా మార్పులకు కారణం కాబోతోందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీని డిజిటిల్ స్ట్రీమింగ్స్ లో విడుదల చేయాలని కొంతమంది నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ - జీ5 - సన్ నెక్స్ట్ - ఆహా - ఎరోస్ మొదలైన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్.. విడుదలకు రెడీ అయిన సినిమాల్ని తమ వైపుకు లాక్కోవాలని చూస్తున్నాయట.
ముఖ్యంగా థియేటర్ లో ఇక రిలీజ్ అవ్వవు అనే సినిమాల్ని మరియు డబ్బింగ్ సినిమాలను కొందరు తక్కువ రేటుకి కొనేసి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో రెవెన్యూ షేరింగ్ విధానంలో రిలీజ్ చేస్తున్నారట. అంతేకాకుండా సదురు నిర్మాతలు ఓవర్ సీస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ.. అక్కడ వారికి ఈ సినిమా పలానా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఉందని.. వివిధ మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేస్తున్నారట. అయితే ఇలా అనేక విధానాలతో సినిమాలకి వ్యూస్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న ఆ నిర్మాతలకు నష్టాలే తప్ప లాభాలు రావడం లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్. కారణం ఎన్నారైలు ఇలాంటి చీప్ సినిమాలపై అసలు ఆసక్తి చూపడం లేదట. వీటి ద్వారా లాభాలు పొందాలని చూసిన నిర్మాతలకు నిరాశే ఎదురవుతున్నదట. దీంతో 'ఉన్నది పోయే.. దాచుకున్నది పోయే' అనే స్థితిలో ఈ డబ్బింగ్ ఓటీటీ నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.