Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత ముచ్చటగా మూడోసారి..!

By:  Tupaki Desk   |   25 Oct 2018 7:19 AM GMT
ఆ నిర్మాత ముచ్చటగా మూడోసారి..!
X
అయన ఒక పేరుమోసిన తెలుగు నిర్మాత. ఎంత పెద్ద నిర్మాత అయినా హైదరాబాద్ లో డ్రంక్ & డ్రైవ్ తప్పించుకోవడం కష్టమేనని అందరికీ తెలిసిందే. లక్కు మన పక్కనుంటే ఎన్ని రోజులైనా తప్పించుకోవచ్చుగానీ లక్కు పోలీసుల పక్కనుంటే ఎలా తప్పించుకోగలం? దీంతో సదరు నిర్మాత ఇప్పటికే రెండు సార్లు డ్రంక్ & డ్రైవ్ లో పట్టుబడ్డాడట.

తాజాగా ఇంకోసారి లక్కు పోలీసుల పక్కన ఉండడంతో మరో సారి పట్టుబడ్డాడు. ఒక టాప్ హీరో పుట్టిన రోజు వేడుకల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసి తిరిగి వస్తూ చిక్కాడట. వాళ్ళు ఊదమంటే ఉఫ్ అని ఊదాడట. ఇంకేముంది మరోసారి కేసు బుక్ అయింది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఎప్పటిలాగే తన బదులు కోర్టుకు తన డ్రైవర్ ను పంపాడట. కానీ ఈ సారి జడ్జివైపు కూడా కాస్త లక్ ఉండడంతో అయన ఈ విషయాన్ని గుర్తించి 'నువ్వు అసలు మనిషిని పంపించు లేదా నిన్ను మూడేళ్ళు జైల్లో వేస్తా' అని సున్నితంగా హెచ్చరించాడట. దీంతో ఈమధ్య కోర్టువారి ఎదుట సదరు నిర్మాత హాజరయ్యాడట. #మీటూ లాంటి భారీ హంగామా కాదు కాబట్టి ఏదో సాధారణ ఛలానా తో బయటపడ్డాడు.

ఇంతకీ ఆ నిర్మాత పార్టీలకు వెళ్ళే సమయంలో డ్రైవర్ ను ఎందుకు తీసుకెళ్ళడు? ఆశ దోశ అప్పడం వడ..అన్నీ ఎలా చెప్తారు? ఆయన ఏదో సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాడట. అయన సీక్రెట్ లన్నీ డ్రైవర్ కు తెలిసిపోవా? ఎవరి జాగ్రత్త వారిది..! ఏదేమైనా ఆ నిర్మాత మాత్రం డ్రంక్ & డ్రైవ్ లో హ్యాట్రిక్ సాధించాడని ఆయన సన్నిహితులు జోకులు పేలుస్తునారట.