Begin typing your search above and press return to search.
ప్రియా కోసం మనవాళ్ల క్యూ
By: Tupaki Desk | 3 March 2018 10:33 AM GMTకన్ను కొట్టి కుర్రాడిని పడేయమే ఇంతవరకు తెలుసు... కానీ ఏకంగా సినిమా ఇండస్ట్రీనే షేక్ చేయడం ప్రియా ప్రకాష్ వల్లే జరిగింది. ఇంతకుముందు ఎంతోమంది హీరోయిన్లు కన్ను కొట్టే సీన్లు చేసినా... అవేవీ పెద్ద పాపులర్ కాలేదు. అంతెందుకు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా కన్ను కొట్టిన సీన్ ఓ సినిమాలో చేసింది. కానీ ప్రియా ప్రకాష్ కన్ను గీటడమే... ఇండస్ట్రీకి బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే ఆమె వెనుక దర్శక నిర్మాత క్యూ కడుతున్నారు.
ఆ కళ్లు... ఆ చూపు... ఆ నవ్వు... చివరలో కన్ను కొట్టడం... ఆ వీడియో అలా చాలా మంది మనసుల్లోనిలిచిపోయింది. ఒరు అడార్ లవ్ సినిమాలో ఓ పాటలోని కేవలం 26 సెకన్ల వీడియో అది. ఆ వీడియో విడుదలై... పెద్ద సంచలనంగా మారింది. ప్రియా ప్రకాష్ వారియర్‌కు వంద సినిమాలు చేసినా రాని గుర్తింపును తెచ్చి పెట్టింది. ఒరు అడార్ లవ్ సినిమా జూన్‌లో విడుదల కానుంది. ఆ సినిమా తరువాత ఆమె చేసే సినిమాలపై ఆసక్తి నెలకొంది. ఆమెను ఎలాగైనా తమ సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేసుకోవాలని కొందరు మన తెలుగు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కొందరైతే రూ.50లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. అయినా ఆ ఆఫర్లేవీ ఒప్పుకోలేదు ప్రియా ప్రకాష్.
ఇంత మంచి ఆఫర్లను ప్రియా ఒప్పుకోకపోవడానికి కారణం... ఒరు అడార్ లవ్ నిర్మాతతో ఆమె చేసుకున్న ఒప్పందమట. తరువాత సినిమా కూడా అతనితోనే చేస్తానని ప్రియా ముందే ఒప్పుకుందట. అందుకే ఆమె వేరే వాళ్ల సినిమాలకు ఓకే చెప్పడం లేదు. అంటే వచ్చే ఏడాది వరకు ప్రియా వేరే భాషా సినిమాల్లో కనిపించే అవకాశం లేనట్టే. లేదా వస్తున్నఆఫర్లను వదులుకోలేక...ఆమె ఏదైనా నిర్ణయం తీసుకున్నా తీసుకోవచ్చు. చూడాలి ప్రియా ఏంచేస్తుందో.