Begin typing your search above and press return to search.

పొరుగింటి కథలకి సేఫ్టీ ఎక్కువ..

By:  Tupaki Desk   |   13 Oct 2015 1:30 AM GMT
పొరుగింటి కథలకి సేఫ్టీ ఎక్కువ..
X
కొన్నేళ్ల క్రితం తెలుగులో వచ్చే సినిమాల్లో తెలుగు స్టోరీలు పెద్దగా ఉండేవి కావు. అన్నీ అరువు కథలు, అరవ స్టోరీలు, పరభాషా వాసనలు నిండిపోయేవి, కానీ కొన్నేళ్ల నుంచి సీన్ మారింది. కొత్త డైరెక్టర్స్ రావడంతో.. కొత్త కథలు జనాలను అలరించాయి. తెలుగుదనం కనిపించింది. మళ్లీ ఇఫ్పుడు అరువు స్టోరీల రాజ్యం వచ్చినట్లు కనిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ కోసం రెండేళ్ల నుంచి స్టోరీలు వింటూ.. చివరకు తమిళ మూవీని కత్తిని ఓకేచేశారన్నది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు. దీన్ని వివి వినాయక్ డైరెక్షన్ చేయనున్నారు. ఆయన కొడుకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. మరో తమిళ మూవీ తని ఒరువన్ ని సురేందర్ రెడ్డి దర్శకుడిగా తెలుగులో తీయబోతున్నాడు. కొణిదెల హీరోలదే కాదు.. అక్కినేని వంశానిదీ ఇదే తంతు ఇప్పుడు. ఫ్రెంచ్ థ్రిల్లర్ ఇన్ టచబుల్స్ ని ఊపిరి పేరుతో తీస్తున్నా నాగ్. కార్తి ఈ మూవీలో నటిస్తున్న మరో హీరో. మళయాళ చిత్రం ప్రేమమ్ ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నాగచైతన్య. మజ్ను అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. శృతిహాసన్ - అనుపమా పరమేశ్వరన్ లు హీరోయిన్స్.

చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో మూవీ చేస్తున్నారు కమల్ హాసన్. చీకటి రాజ్యంగా వస్తున్న ఈ చిత్రానికి ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్స్ ఆధారంగా తెలుస్తోంది. ఇక రవితేజ కూడా స్పెషల్ ఛబ్బీస్ ను తెలుగులో తీసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది. గోపాలాగోపాలా తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్.. మళయాళ మూవీ భాస్కర్ ది రాస్కెల్ ను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాలీవుడ్ టాక్.

ఇప్పుడు మేకింగ్ కాస్ట్ బాగా పెరిగింది. స్టోరీ పరంగా రిస్క్ చేయడం ఇష్టంలేకే.. ఇలా రీమేక్ సినిమాలకు మొగ్గు చూపుతున్నారు హీరోలు, నిర్మాతలు. మధ్యమధ్యలో డైరెక్ట్ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవుతున్నా.. సేఫ్ గేమ్ కే ఇంపార్టెన్స్ పెరుగుతోందనే విషయం అర్ధమవుతోంది.