Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కొత్త ట్రెండ్!
By: Tupaki Desk | 26 Dec 2022 9:03 AM GMTటాలీవుడ్ సినిమాలకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. గతంలో దక్షిణాదికి మాత్రమే పరిమితమైన తెలుగు సినిమాలు గత కొంత కాలంగా ఉత్తరాదిలోనూ సత్తా చాటుతున్నాయి. అనువాద వెర్షన్ లకు ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో మన సినిమాలకు అక్కడా రికార్డు స్థాయి వసూళ్లు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది.
టాలీవుడ్ లో వున్న క్రేజీ ప్రొడక్షన్ కంపనీలకు సినిమానే ప్రధాన బిజినెస్ కాదన్నది చాలా మందికి తెలియదు. కొంత మంది రియల్ ఎస్టేట్ రంగంలో వుంటే మరి కొంత మంది సాఫ్ట్ వేర్ రంగంలోనూ రానిస్తున్నారు. మరి కొంత మంది రెస్టారెంట్ బిజినెస్ లో తమ సత్తా చాటుకుంటుంటే మరి కొంత మంది కన్ స్ట్రక్షన్ బిజినెస్ లో రాణిస్తున్నారు. అయితే తమ సైడ్ బిజినెస్ లకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం సినిమాలని ప్రధానంగా వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
మైత్రీ వారు సినిమాతో పాటు ఇతర బిజినెస్ లోనూ వున్నారు. దిల్ రాజు సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ బిజినెస్ లో రాణిస్తున్నారు. ఇక ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ వారికి ఐటీ తో పాటు పలు బిజినెస్ లున్నాయి. పీపుల్ మీడియా కూడా ఐటీ రంగం నుంచి సినిమాల్లోకి ప్రవేశించిందే. అటు ఐటీతో పాటు ఈ సంస్థ సినిమా బిజినెస్ లోనూ రానిస్తోంది. ఈ ఏడాది నుంచి సినిమాల నిర్మాణం పరంగా బిగ్ లీగ్ లోకి అడుగుపెడుతోంది.
వీరితో పాటు 14 ప్లస్ రీల్స్, డీవీవీ దానయ్య.. దుర్గా ఆర్ట్స్ కె.ఎల్ నారాయణ కన్ స్ట్రక్షన్ బిజినెస్, ఐరా క్రియేషన్స్ మరో బిజినెస్.., ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత రామ్ తాళ్లూరి ఐటీ రంగం నుంచి వవచ్చారు. ఇప్పటికీ కొనసాగిస్తూనే సినిమాలు నిర్మిస్తున్నారు. యువీ కూడా కన్ స్ట్రక్షన్ బిజినెస్ లో వుంది.
ఇందులో కొంత మంది తాము నిర్మించే సినిమాల్లో తమ కంపనీ బ్రాండ్ లని తెలివిగా ప్రమోట్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు 'ధమాకా' మూవీలో తమ కంపనీ బ్రాండ్ లని ప్రమోట్ చేసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ఇదే పార్ములాని ఇకపై ఇతర ప్రొడ్యూసర్స్ కూడా ఫాలో కాబోతున్నారట. దీంతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలు కాబోతోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.