Begin typing your search above and press return to search.
రిలీజ్ క్లారిటీలు ఎందుకిస్తున్నారు బాబులూ?
By: Tupaki Desk | 3 Oct 2016 10:30 PM GMTటాలీవుడ్ బాక్సాఫీస్ రేంజ్ పెరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు బాగున్న సినిమాలు ఏవైనా కూడా 70 కోట్ల పైమాటే షేర్ వసూలు సత్తాను తెచ్చేసుకున్నాయి. థ్యాంక్స్ టు బాహుబలి. ఆ సినిమా తరువాత సినిమాలను ధియేటర్లలో చూసే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరిగిందని అనుకోవాలి. లేకపోతే అంతేసి కలక్షన్లు ఎలా సాధ్యపడతాయ్ మరి. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే.. ఈ రేంజు వసూళ్ళకు ఇప్పుడు హాలీడే సీజన్లతో పాటు సోలో రిలీజ్ డేట్ కూడా ముఖ్యమే.
ఇకపోతే గడచిన కొద్ది రోజుల్లో ఓ రెండు పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్లను టకటకా ప్రకటించేశాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వకపోయినా కూడా వీరు రిలీజ్ డేట్లను లాక్ చేస్తున్నారు. బహుశా బాలీవుడ్ తరహాలోనే ముందుగానే పర్టికులర్ డేట్ లాక్ చేసేస్తున్నారేమోలే. ఇంకా మూడు నెలల షూటింగ్ తో పాటు పూర్తవ్వాల్సిన విజువల్ ఎఫెక్ట్స్ వర్కు కూడా బోలెడంత ఉన్నప్పటికీ.. బాహుబలి 2 రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఏప్రియల్ 28 రిలీజ్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఇతరులు తమ రిలీజులను హ్యాపీగా ప్లాన్ చేసుకునే ఛాన్సుంటుంది. కాని గతంలో కూడా ఇదే విధంగా చాలా క్లారిటీగా డేట్లు చెప్పిన రాజమౌళి.. లాస్ట్ మినిట్లో సినిమాను పోస్టుపోన్ కూడా చేశాడు. కాని ఈసారి మాత్రం చెప్పిన డేటుకు వస్తే బాగుంటుంది.
కేవలం 70% షూటింగ్ మాత్రమే పూర్తిచేసుకున్న ఖైదీ నెం 150 డేటును కూడా ఎనౌన్స్ చేశాడు రామ్ చరణ్. సంక్రాంతి పండుగ సంగర్భంగా జనవరి 2017లో పండగ తేదీల్లో ఒక రోజును వస్తుందని చెప్పేశాడు. అసలే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ప్రాజెక్ట్ కాబట్టి ఖచ్చితంగా హైప్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ముందే రిలీజ్ గురించి చెప్పేస్తే వేరే కాంపిటీటర్లు అందరూ ఎడ్జస్టుమెంట్ చేసుకుంటారని కాబోలు.. ఇలా ముందే ప్రకటించేశారు.
అయితే తెలుగులో ప్రతీసారి ఇలా ఎనౌన్స్ మెంట్లు ఇచ్చేసి.. తరువాత వాటిని పోస్టుపోన్ చేస్తున్నారు. అలా చేయకుండా ఈ రెండు పెద్ద సినిమాలూ కూడా చెప్పిన టైముకే వస్తే మాత్రం వెనుకే వస్తున్న చిన్న సినిమాలన్నీ సేవ్ అవుతాయి. ఒకవేళ ఈ పెద్దవి డేటు మార్చితే.. అప్పటికే ప్రమోట్ చేసుకున్న చిన్నవి ఇబ్బంది పడుతూ.. ప్రమోషన్ ఖర్చులు వేస్టయ్యే ఛాన్సుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/