Begin typing your search above and press return to search.

డబ్బింగ్ ఫిలిమ్స్: రూల్ పై అందరూ మౌనమే!

By:  Tupaki Desk   |   8 Jan 2019 1:30 AM GMT
డబ్బింగ్ ఫిలిమ్స్: రూల్ పై అందరూ మౌనమే!
X
సంక్రాంతి బరిలోకి లేటుగా దిగినప్పటికీ రజనీకాంత్ 'పేట' మాత్రం లేటెస్ట్ గా వివాదం సృష్టించింది. తమకు థియేటర్లు సరిగా దొరక్కపోవడంతో తెలుగు రాష్ట్రాలలో థియేటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న వారిపై 'పేట' ను తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఇది రానున్న రోజులలో మరింత ముదిరే అవకాశం ఉంది.

ఈ హంగామాలో పడి సాధారణ జనాలు డబ్బింగ్ సినిమాల విషయంలో ఒక రూల్ ఉందనే సంగతి మర్చిపోయారు. గతంలో డబ్బింగ్ సినిమాలను పండగ సీజన్లలో విడుదల చేయడానికి లేదంటూ ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ను రెండుమూడేళ్ళు గట్టిగా అమలు చేశారు. ఇప్పుడు అదే రూల్ కనుక ఫాలో అయితే 'పేట' కోసం మరో రిలీజ్ డేట్ వెతుక్కోవలసిందే. కానీ ఈ విషయం పై పెద్ద నిర్మాతలు మౌనంగా ఉండడానికి ఒక కారణం ఉంది.

లాస్ట్ సంక్రాంతికి యూవీ క్రియేషన్స్ వారు డబ్బింగ్ సినిమా 'గ్యాంగ్' ను విడుదల చేశారు. ఎవ్వరూ అభ్యంతరం లేవనెత్తకపోవడంతో వీలైనన్ని థియేటర్లు దొరికాయి. ఇప్పుడు 'పేట' విషయంలో డబ్బింగ్ సినిమాల రూల్ కనుక లేవనేత్తితే తప్పకుండా పెద్ద నిర్మాతలపై విమర్శలు వస్తాయి. దీంతో వాళ్ళు కిమ్మనకుండా ఉన్నారు.

ఈ రూల్ తెచ్చినప్పుడు పెద్ద నిర్మాతలు డబ్బింగ్ సినిమాలపై ఫోకస్ చేసేవారు కాదు. కానీ తర్వాత కాలంలో పెద్ద నిర్మాతలు కూడా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేస్తుండడంతో ఆ రూల్ ను అటకెక్కించారు. ఇప్పుడు కనుక అదే రూల్ ఉంటే ఈ వివాదమే ఉండేది కాదు.