Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కు వరుస ఫ్లాపులు..వాళ్లు కూడా చేతులెత్తేశారా?
By: Tupaki Desk | 4 Aug 2022 4:30 PM GMTకరోనా తరువాత భారతీయ సినిమాకు కొత్త దారులు చూపిచడమే కాకుండా టాలీవుడ్ కొండంత ధైర్యాన్నిచింది. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసే బాలీవుడ్ ఇండస్ట్రీ థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? రానా అని భయాందోళనకు గురవుతున్నవేళ యావత్ సినీ ప్రపంచవానికి టాలీవుడ్ కొత్త ఊపిరులూదింది. తమిళ సినిమాలు సైతం థియేటర్లలో రిలీజ్ కు వెనుకాడుతూ ఓటీటీ బాటపడుతున్న సమయంలో యాభై శాతం ఆక్యుపెన్సీతో అయినా సరే అద్భుతాలని సృష్టిస్తామని యావత్ భారతీయ చిత్ర పరిశ్రకు ధైర్యాన్నిచ్చింది.
అలాంటి ఇండస్ట్రీ RRR, కేజీఎఫ్ 2 రిలీజ్ ల తరువాత అనేక సమస్యలతో సతమతమవుతూ వస్తోంది. తాజాగా మరో సమస్య టాలీవుడ్ కు సరికొత్త ఇబ్బందుల్ని క్రియేట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఓటీటీల ప్రభావం, టికెట్ రేట్లు భారీగా పెంచేయడం, థియేటర్లలో విచ్చలవిడిగా ఫుడ్, స్నాక్స్ పై జరుగుతున్న దోపిడీ కారణంగా సగటు ప్రేక్షకుడు థియేటర్లకు రావడానికి భయడుతున్న పరిస్థితి. దీంతో ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు పెద్దగా ఆదరణ కరువైంది.
ప్రేక్షకుల నుంచి రీసెంట్ గా విడుదలైన సినిమాలకు ఆశించిన స్థాయి స్పందన లభించకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవుతున్నాయి. జూలై నెలలో విడుదలైన ఒక్క తెలుగు సినిమా కూడా కనీసం యావరేజ్ అనే మాటని కూడా రాబట్టలేకపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. తాజా పరిస్థితుల కారణంగా స్టార్‌ప్రొడ్యూసర్ల నుంచి చిన్న నిర్మాతల వరకు భారీ నష్టాలని చవి చూస్తున్నారు.
ఈ నష్టాలు ఇప్పుడు నిర్మాతలకు కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెట్టినట్టుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా సినిమాల నిర్మాణం ఫైన్సియర్ల వల్లే జరుగుతోంది. ఎంత టాప్ ప్రొడ్యూసర్ అయినా సినిమా బడ్జెట్ లో సిహ భాగాన్నిచాలా వరకు ఫైనాన్సియర్ ల నుంచే పెట్టుబడిగా వడ్డీలకు తీసుకుంటూ వస్తున్నారు. ఆ తరువాత సినిమా బిజినెస్ , రిటర్న్స్ లని బట్టి తీర్చేస్తూ వస్తున్నారు. కానీ ఈ మధ్య విడుదలైన సినిమాలు వరుగా డిజాస్టర్లు అవుతుండటం, పెద్దగా రిటర్న్స్ లు చేకపోవడంతో ఫైనాన్సియర్ లు ఆలోచనలో పడ్డారట.
అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం క్రైసిస్ లో వున్న కారణంగా పెట్టుబడులు పెట్టడం పెద్ద రిస్క్ గా భావిస్తున్నారని వార్తులు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో వున్న చాలా వరకు బడా నిర్మాతలకు ఏపీకి చెంది బడా వ్యాపారులు, రాజకీయ నేతలు, మైనింగ్ బిగ్ షాట్స్ తో పాటు చెన్నైకి చెందిన ప్రముఖ ఫైనాన్సియర్ లే కాకుండా మరి కొంత మందికి యుఎస్ కి చెందిన వారి నుంచి కూడా ఫండింగ్ భారీ స్థాయిలో వస్తూ వుంటుంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో చాలా వరకు ఫైనాన్సియర్స్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు ఫైనాన్స్ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదట. ప్రస్తుత పరిస్థితులని చూసి వారు కూడా చేతులెత్తేసినట్టుగా చెబుతున్నారు. పొలిటికల్ లీడర్ల నుంచి రావాల్సిన మొత్తం కూడా రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని ఎవరూ బయటికి దీయడం లేదట. దాంతో టాలీవుడ్ కు చెందిన చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్లు ఫైనాన్స్ కోసం దిక్కులు చూస్తున్నారని ఇన్ సైడ్ టాక్.