Begin typing your search above and press return to search.

చెర్రీని పొగిడేస్తే.. కోట్లలోనే ప్రతిఫలం

By:  Tupaki Desk   |   24 May 2015 11:30 AM GMT
చెర్రీని పొగిడేస్తే.. కోట్లలోనే ప్రతిఫలం
X
నచ్చేట్టు పొగిడేసెయ్‌.. కావాల్సింది పొందేసెయ్‌. నీ హీరో గురించి నాలుగు మంచి మాటలు చెప్పు.. అదే కోట్లు మిగుల్చుతుంది. అయితే సదరు హీరోలోనూ అంతే మంచితనం అవసరం. అర్థం చేసుకునే గుణం ముఖ్యం. పరిస్థితుల్ని బేరీజు వేసకుని నా నిర్మాత బావుండాలి అన్న ఆలోచన తనలో ఉండి తీరాలి. ఈ రెండు విషయాల్లో రామ్‌ చరణ్‌ ది బెస్ట్‌.. అని అంటున్నారు నిర్మాతలు.

చెర్రీ పూర్తి పరిణతి ఉన్న హీరో. నిర్మాత శ్రేయస్సును కోరే హీరో. సినిమా సెట్స్‌కెళ్లే ముందే పక్కా ప్రణాళికతో ఉంటున్నాడు. బడ్జెట్‌ అదుపుతప్పి నిర్మాతకు బోడిగుండు అవ్వకుండా తనవంతు సాయం చేస్తున్నాడు. అప్పట్లో గోవిందుడు అందరివాడే విషయంలో చరణ్‌ పూర్తిగా ఇన్వాల్వ్‌ అయ్యాడు. దర్శకనిర్మాతలకు కావాల్సినంత సాయం అయ్యాడు. దానివల్ల ఖర్చు తగ్గింది. కాకపోతే సినిమా ఫ్లాపవ్వడంతో డెఫిషిట్‌లో పడాల్సొచ్చింది. లేటెస్టుగా వైట్ల సినిమా కోసం తన నిర్మాత డి.వి.వి.దానయ్యకి అన్నిరకాలా సాయపడుతున్నాడు. అనవసర ఖర్చుల్ని పెట్టనీకుండా చూస్తున్నాడు. ఎంత అవసరమో అంతే పెట్టుబడి.

అందుకే చెర్రీతో పనిచేసే నిర్మాతలంతా అతడిని విపరీతంగా పొగిడేస్తున్నారని అనుకోవాలి. బండ్ల గణేష్‌ చరణ్‌ని వీలున్నప్పుడల్లా చిన్న బాస్‌ అంటూ తెగ ఆకాశానికెత్తేస్తాడు. చరణ్‌లోని గొప్ప క్వాలిటీస్‌ని పొగిడేస్తాడు. ఇప్పుడు దానయ్య ప్రత్యక్షంగా చూస్తున్నాడు కాబట్టి చరణ్‌కి అభిమాని అయి తీరడం ఖాయం అన్నమాట.