Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో ఆ నిర్మాతలకి చెడిందా..?

By:  Tupaki Desk   |   25 March 2020 4:50 AM GMT
సూపర్ స్టార్ తో ఆ నిర్మాతలకి చెడిందా..?
X
మైత్రీ మూవీ మేకర్స్.. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ గా వెలుగొందుతున్న వాళ్లలో వీరు కూడా ఉంటారు. 2015లో వచ్చిన 'శ్రీమంతుడు' ద్వారా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ సంస్థ తక్కువ కాలంలోనే టాప్ రేంజ్ కి చేరిపోయింది. హీరోల పేర్లు - డైరెక్టర్లను మాత్రమే గుర్తుపెట్టుకునే ఈ రోజుల్లో తమ చిత్రాల ద్వారా ప్రొడక్షన్ హౌజ్ నేమ్ కూడా గుర్తు పెట్టుకునేలా చేసుకుంది. రంగస్థలం - జనతా గ్యారేజ్ చిత్రాలతో టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది. గతేడాది కొంచం దెబ్బతిన్న ఈ సంస్థ మళ్ళీ పుంజుకోవాలన్న కసితో మెగా వారసుడితో 'ఉప్పెన' సినిమాను విడుదలకు సిద్ధం చేసింది. అంతే కాకుండా సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో దాదాపు అందరి డేట్స్ కలిగివున్న ఈ సంస్థ ఒక్క సూపర్ స్టార్ విషయంలో మాత్రం నిరాశ పరిచిందని సమాచారం.

వివరాల్లోకి వెళ్తే తమ సంస్థను ఇంట్రడ్యూస్ చేసిన మహేష్ బాబు తో మళ్లీ మూవీ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుందంట. దీనికి సంబంధించి మహేష్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఎక్కడ ఏమి జరిగిందో తెలియదు కాని ఇప్పుడు వీరిరువురికి చెడిందంట. అందుకే వీళ్ళ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కట్లేదని సమాచారం. అలా అని మహేష్ దగ్గర అడ్వాన్స్ తిరిగి తీసుకోలేదట. ఇదిలావుండగా మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పరశురామ్ తో లైన్ పెట్టి 14 రీల్స్ వాళ్ళని రంగంలోకి దింపాడు మహేష్. దీంట్లో ఎలాగూ మహేష్ నిర్మాణ సంస్థ భాగస్వామిగా ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న సూపర్ స్టార్ 14 రీల్స్ వాళ్ళని మైత్రీ మూవీస్ కి పోటీగా దింపాడట. వాస్తవానికి మైత్రీ వాళ్ళని లాంచ్ చేసింది మహేషే అయినప్పుడు ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో అని అర్థం కావడం లేదని ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటున్నారట. ఏది ఏమైనా మహేష్ కి, నమ్రతకి వీరి మీద ఎందుకు నెగిటివిటీ ఏర్పడిందో, మైత్రీ వాళ్లకి మహేష్ తో ఎందుకు చెడిందో వారికే తెలియాలి మరి.