Begin typing your search above and press return to search.

కామెంట్‌: కలెక్షన్ల కోసం కాలేజ్‌ లే టార్గెట్‌

By:  Tupaki Desk   |   26 Sep 2015 5:30 PM GMT
కామెంట్‌: కలెక్షన్ల కోసం కాలేజ్‌ లే టార్గెట్‌
X
రీసెంట్ టైమ్స్‌ లో మ‌న సినిమాల ప్ర‌మోష‌న్ స్ర్టాట‌జీ మారిపోయింది. మ‌న‌వాళ్లంతా ప‌బ్లిసిటీ కోసం కాలేజ్‌ ల మీద పడుతున్నారు. అక్క‌డైతేనే క్రేజు రెట్టింపు అవుతుంద‌న్న‌ది భావ‌న‌. అయితే అది కాలేజ్ బ్యాక్‌ డ్రాప్ సినిమానా? లేక వేరే కంటెంట్ తో తెర‌కెక్కుతున్న‌దా? అన్న‌ది లేకుండానే ప‌బ్లిసిటీ కోసం కాలేజ్‌ ల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంత‌కుముందు షాపింగ్ మాల్స్ - మ‌ల్టీప్లెక్సుల్ని టార్గెట్ చేసి జ‌నాలు ఎక్కువ‌గా ఉండే చోట పాగా వేసి మ‌రీ ప్ర‌చారం చేసుకునేవారు. కానీ ఇప్పుడు నేరుగా కాలేజ్‌ ల‌నే టార్గెట్ చేస్తున్నారు.

అయితే ఈ ట్రెండ్ తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల‌నే మొద‌లు పెట్టాడు. అత‌డు హ్యాపీడేస్ లాంటి కాలేజ్ బేస్డ్ సినిమాలు తెర‌కెక్కించి వాటికి కాలేజ్ యూత్‌ లో ప్ర‌చారం చేసి ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాడు. ఇటీవ‌ల కాలంలో కేరింత ప్ర‌మోష‌న్ కోసం దిల్‌ రాజు కాలేజ్‌ ల‌నే టార్గెట్ చేశాడు. కాలేజ్ నేప‌థ్యం ఉన్న సినిమాల‌కు మాత్ర‌మే కాలేజ్‌ ల‌లో ప్ర‌మోష‌న్ చేస్తున్నామ‌ని దిల్‌ రాజు అన్నారు. అయితే కాలేజ్ ల‌లో యూత్‌ తో క‌నెక్ట‌వ్వ‌డం వ‌ల్ల పెద్ద విజ‌యం వ‌స్తుంద‌నే ఇలా చేస్తున్నామ‌ని ప‌లువురు చెబుతున్నారు. ఇటీవ‌లి కాలంలో సిఎంఆర్ గ్రూప్‌ తో క‌లిసి గుణ‌శేఖ‌ర్ రుద్ర‌మ‌దేవి ప్ర‌చారం కాలేజ్‌ ల‌లోనే సాగిస్తున్నాడు.

లేటెస్టుగా అఖిల్ న‌టించిన మాస్ ఎంట‌ర్‌ టైన‌ర్ అఖిల్ ప్ర‌మోష‌న్ కూడా కాలేజ్‌ ల‌లో జోరుగా సాగిస్తున్నారు. దీనికోసం అఖిల్ న‌గ‌రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ గాళ్స్ కాలేజ్‌ కి వెళ్లొచ్చాడు. అక్క‌డ స్టూడెంట్స్‌ తో క‌లిసి చిలౌట్ చేశాడు. ఇలా చేయ‌డం వ‌ల్ల నేరుగా స్టూడెంట్స్‌ తో క‌నెక్ట‌యిన‌ట్టు ఉంటుంది. ఫ్యాన్స్ బేస్ కూడా పెరుగుతుంది. న‌వ‌త‌రానికి ఎక్కువ క‌నెక్ట‌యిన‌ట్టు ఉంటుంద‌ని అఖిల్ చెప్పాడు. అప్ప‌ట్లో ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ప్ర‌మోష‌న్ కోసం నాని చైత‌న్య భార‌తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కాలేజ్ లో ప్ర‌మోష‌న్ చేశాడు. వివిఐటి గుంటూర్ కాలేజ్ లోనూ ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్స్ సాగాయి. యువి క్రియేష‌న్స్ నిర్మించే సినిమాకు కాలేజ్‌ ల‌లోనే ఎక్కువ‌గా ప్ర‌మోష‌న్స్ చేస్తుంటారు.

ఇలా ఇదంతా చూస్తుంటే కాలేజ్ యూత్ వ‌ల్లే సినిమా హిట్టు కొడుతుంది. ఫ్యాన్ బేస్ పెరుగుతుంది అన్న భావ‌న‌లో మ‌న సినిమావాళ్లు ఉన్నార‌ని అనిపిస్తోంది.