Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ డేస్ ని నిర్మాతలు ఈ విధంగా వాడుకుంటున్నారా...?

By:  Tupaki Desk   |   11 April 2020 1:30 AM GMT
లాక్ డౌన్ డేస్ ని నిర్మాతలు ఈ విధంగా వాడుకుంటున్నారా...?
X
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి. దీని నుండి బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ తమ విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. ఈ సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతోపాటు లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగిస్తారన్న వార్తలు రావడంతో సినిమాలు థియేటర్లలో ఎప్పుడు రిలీజయ్యేలా అనే సందిగ్ధంలో పడిపోయారు నిర్మాతలు. రేపు లాక్ డౌన్ ఎత్తేసినా భారీ బడ్జెట్ సినిమాలు ఎంత రెవెన్యూ సాధించగలవో అని నిర్మాతలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. దీంతో చేసేదేమీ లేక కొంతమంది నిర్మాతలు ఎలాగైనా మనం సినిమాల మీదే బ్రతకాలి కదా అనుకొని.. ఈ లాక్ డౌన్ డేస్ ని వేస్ట్ చేయడం ఎందుకని టెక్నాలజీని వాడుకొని కొత్త స్క్రిప్ట్ లను వింటున్నారట.

వివరాల్లోకి వెళ్తే లాక్ డౌన్ నేప‌థ్యంలో బ‌య‌ట‌కు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో కొంద‌రు బ‌డా నిర్మాతలు ఫోన్ కాల్స్ - వీడియో కాలింగ్ ఆప్ష‌న్ ఉప‌యోగించుకొని కొత్త క‌థ‌లు వింటున్నారట. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు తీస్తున్న దిల్ రాజు - బ‌న్నీ వాసు - యూవీ వంశీ - న‌వీన్ - రామ్ త‌ళ్లూరి - స్ర‌వంతి ర‌వికిషోర్ - అన్నేర‌వి త‌దిత‌ర నిర్మాత‌లు కొత్త క‌థ‌ల్ని బ్యాకింగ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ని విశ్వసనీయ సమాచారం. క‌థ న‌చ్చితే స‌ద‌రు రైట‌ర్ లేదా డైక‌ర్ట‌ర్ ద‌గ్గ‌ర నుంచి క‌థ‌ను తీసుకొని ఆ త‌రువాత ప‌రిస్థితిని బ‌ట్టి సినిమా చేస్తే బెట‌ర్ అనే రీతిలో ప్ర‌స్తుతం తెలుగు నిర్మాత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స‌మాచారం. వీరితో పాటు కొంతమంది వర్థమాన నిర్మాతలు కూడా ఇదే ఫాలో అవుతున్నారట. నిర్మాతలతో పాటు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వీడియో కాల్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్ వేస్తున్నారని సమాచారం. ఏదేమైనా ఈ కరోనా వైరస్ నిర్మాతలకు గడ్డుకాలం వచ్చేలా చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాల అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాతే కదా..!