Begin typing your search above and press return to search.

మహేష్‌ ను బాగా వాడేసుకుంటున్నారు...!

By:  Tupaki Desk   |   12 Feb 2016 11:00 PM IST
మహేష్‌ ను బాగా వాడేసుకుంటున్నారు...!
X
'దూకుడు'లో మహేష్‌ అందరినీ వాడేసుకుంటాడు. కానీ నిజ జీవితానికి వస్తే మహేష్‌ ను అందరూ బాగా మొహమాటపెట్టి వాడేసుకుంటున్నారు. తద్వారా మహేష్‌ కు ఉన్న క్రేజ్‌ ను తమకనుకూలంగా మార్చుకుంటున్నారు. తన బావ సుధీర్‌ బాబు హీరోగా నటించే చిత్రాల ఆడియో వేడుకలన్నింటికి మహేష్‌ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహేష్‌ సుదీర్‌ బాబు ఫంక్షన్లకు వెళ్తున్నాడు. ఇక తన తండ్రి సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా తన తనయుడు మహేష్‌ బాబు ఇమేజ్‌ ను వాడేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

ఆయన చాలా గ్యాప్‌ తర్వాత చేస్తున్న 'శ్రీశ్రీ' చితం ఆడియో వేడుకకు కూడా మహేష్‌ ముఖ్యఅతిథిగా రానున్నాడు. ఇక తనతో మంచి అనుబంధం ఉన్న 14రీల్స్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ అధినేతలు తాజాగా నిర్మించిన 'కృష్ణగాడివీరప్రేమగాథ' ఆడియోకు మహేష్‌ బాబే గెస్ట్‌ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తనతో 'బ్రహ్మూత్సవం' సినిమాను నిర్మిస్తున్న పివిపి బేనర్‌ తాజా నిర్మించిన 'క్షణం' ట్రైలర్‌ లాంఛ్‌ కు కూడా మహేషే చీఫ్‌ గెస్ట్‌ గా హాజరయ్యాడు. ఇలా తను అనుకొన్న వారి కోసం, తనవారి కోసం మహేష్‌ మొహమాటంతోనో లేక మరే కారణంతోనో వారి ఒత్తిడికి తలవంచి ఇలా ఫంక్షన్లకు హాజరవుతున్నాడు మహేష్‌.