Begin typing your search above and press return to search.

భారీ విరాళాలిస్తున్న సినీ నిర్మాతలు..

By:  Tupaki Desk   |   27 March 2020 3:30 PM GMT
భారీ విరాళాలిస్తున్న సినీ నిర్మాతలు..
X
టాలీవుడ్ లో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నేడు కరోనా బాధితుల సహాయార్థం, వారి వైద్య సదుపాయం కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని అందజేశారు. ఒక్కో రాష్ట్రానికి పది లక్షల చొప్పున తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల ప్రజలు లాక్ డౌన్ లో ఘోరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలిపని చేసుకునే వారి పరిస్థితి మరీ దారుణం.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం భారీ విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా నిర్మాత దిల్ రాజు - హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు కూడా ముందుకొచ్చి విరాళాలు అందించాయి. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న 'ఉప్పెన' సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ విధించడంతో సినిమా విడుదల తేది వాయిదా పడింది. విడుదల తేదీని లాక్ డౌన్ అనంతరం ప్రకటిస్తారు కాబోలు..