Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: టాలీవుడ్ రైజింగ్ డైరెక్టర్స్
By: Tupaki Desk | 14 April 2019 1:30 AM GMTప్రతి సినిమా మొదటి సినిమానే అనుకుని పని చేయాలిక్కడ. సెంటిమెంటు పరిశ్రమ పరాజయాన్ని అస్సలు ఒప్పుకోదు. ఒకసారి ఫెయిలైతే తిరిగి అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేం. అలా ఎందరో ఇక్కడ కెరీర్ చాలించిన వాళ్లు ఉన్నారు. ముఖ్యంగా దర్శకులకు సక్సెస్ ఒక్కటే గీటురాయి. ఫెయిలైతే ఒకటీ అరా అవకాశాలు రావొచ్చు కానీ రెండోసారీ ఫెయిలైతే క్షమించే ప్రసక్తే ఉండదు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరూపించుకోకపోతే అటుపై కెరీర్ డైలమానే. అయితే ఈ డైలమా నుంచి ఓవర్ కమ్ అయ్యే సత్తా ఉన్న దర్శకులెవరెవరు? అన్నది పరిశీలిస్తే..
ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఒకసారి ఫెయిలైనా తిరిగి అవకాశం అందుకునే సత్తా ఉన్న దర్శకుల జాబితాని పరిశీలిస్తే... ఈ జనరేషన్ లో మారుతి- పరశురామ్- శ్రీరామ్ ఆదిత్య- చందు మొండేటి- సుధీర్ వర్మ- కృష్ణ చైతన్య- హను రాఘవపూడి- కిషోర్ తిరుమల.. వీళ్లంతా ఒక వేవ్ లా తెరపైకి దూసుకొచ్చారు. వీళ్లంతా జయాపజయాల్ని ఎదుర్కొన్న వారే. బ్లాక్ బస్టర్లతో పాటు ఫ్లాప్ లు ఇబ్బంది పెట్టాయి. ఇక నవతరం దర్శకుల్లో అనీల్ రావిపూడి వరుస హిట్లతో బండిని సజావుగా సాగించడంలో పెద్ద సక్సెసయ్యాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్ల జాబితాలో అతడి పేరు చేరిపోయింది. `ఎఫ్ 2`తో బ్లాక్ బస్టర్ అందుకుని అనీల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 సంస్థకు గీత గోవిందం లాంటి సెన్సేషనల్ హిట్ ని ఇచ్చిన పరశురామ్ ప్రస్తుతం మరో క్రేజీ స్క్రిప్టు పై వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్- అఖిల్ లకు పరశురామ్ కథలు చెప్పారని ఇటీవల ప్రచారమైంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరితో సినిమా చేస్తాడు? అన్నదానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. తదుపరి ప్రకటన వెలువడాల్సి ఉందింకా. సిద్ధార్థ హీరోగా దిల్ రాజు కాంపౌండ్ లో సినిమా తీసిన వేణు శ్రీరామ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అదే కాంపౌండ్ లో `ఐకన్` అనే భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గత చిత్రం `శైలజా రెడ్డి అల్లుడు` ఫ్లాపైనా.. మారుతికి అవకాశాల పరమైన ఇబ్బంది లేదు. ప్రస్తుతం సాయిధరమ్ తో సినిమా చేసేందుకు మారుతి రెడీ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. కార్తికేయ- ప్రేమమ్ లతో హిట్టు కొట్టిన చందు మొండేటికి `సవ్యసాచి` లాంటి ఫ్లాప్ ఎదురైంది. ఆ తర్వాత ఓవర్ కమ్ అయ్యేందుకు ట్రయల్స్ లో ఉన్నారట. `అందాల రాక్షసి` తో క్లాసిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుని `కృష్ణ గాడి వీర ప్రేమ గాద` చిత్రంతో విజయం అందుకున్న హను రాఘవపూడి `లై`, `పడి పడి లేచే మనసు` చిత్రాలతో ఫ్లాపుల బాట పట్టారు. ప్రస్తుతం హను కెరీర్ పరంగా డైలమాలో ఉన్నా ఓవర్ కమ్ అయ్యేందుకు ఛాన్సుందని సన్నిహితులు చెబుతున్నారు.
కెరీర్ లో ఐదు సినిమాలు చేసిన సుధీర్ వర్మ స్వామి రారా, కేశవ (యావరేజ్) చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మాఫియా డాన్ కథాంశంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సత్తా చాటాలని సుధీర్ వర్మ సీరియస్ ఎటెంప్ట్ లో ఉన్నారు. కిషోర్ తిరుమలకు `నేను శైలజ` తర్వాత రెండు ఫ్లాపులొచ్చాయి. చిత్రలహరితో లక్ చేసుకునేందుకు ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చారు. తొలివారం రిపోర్ట్ తో సినిమా ఫలితం ఏంటో తేలనుంది. మిడిల్ క్లాస్ సెన్సిబిలిటీస్ తో సినిమాలు తీయగలిగే సత్తా కిషోర్ తిరుమలకు ఉందని ఐడెంటిటీ దక్కింది. `రౌడీ ఫెలో` చిత్రంతో దర్శకుడిగా క్లాసిక్ హిట్ అందుకున్న చైతన్య కృష్ణ రచయితగానూ పక్కా ట్యాలెంటెడ్. లిరిసిస్ట్ కం డైలాగ్ రైటర్ గా సత్తా చూపించారు. చల్ మోహనరంగ చిత్రంతో ఫ్లాప్ ఎదురైంది. ప్రస్తుతం మూడో సినిమా కసరత్తుపై సరైన సమాచారం తెలియాల్సి ఉందింకా.
ఆ తర్వాత .. కాస్త యంగ్ జనరేషన్ లో మరో అరడజను దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ, ఆర్.ఎక్స్ 100 అజయ్ భూపతి, ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి, శివ నిర్వాణ, గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ వర్మ, రాహుల్ సాంకృత్యన్, భరత్ కమ్మ తదితరులు దర్శకులుగా రైజింగ్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. `అర్జున్ రెడ్డి` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ తొలి ప్రయత్నమే సంచలన విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో అదే చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు మహేష్ కోసం స్క్రిప్టు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఘాజీ చిత్రంతో సంచలనం సృష్టించిన సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ హీరోగా `అంతరిక్షం` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ద్వితీయ విఘ్నం ఇబ్బంది పెట్టినా సంకల్ప్ లోని యూనిక్ ఎక్స్ పెరిమెంటల్ యాటిట్యూడ్ పై మన హీరోలకు గురి ఉంది. రైజింగ్ డైరెక్టర్ గా సంకల్ప్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. `ఆర్.ఎక్స్ 100` చిత్రంతో ఆరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్న అజయ్ భూపతి ఆర్జీవీ కాంపౌండ్ డైరెక్టర్ గా తనదైన శైలిలో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం రెండో సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సమంత ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో ష్యూర్ షాట్ గా హిట్లు కొట్టిన శివ నిర్వాణ నెక్ట్స్ దేవరకొండతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సున్నిత ఉద్వేగాల్ని నవ్యపంథా కథాంశంతో ఎలివేట్ చేసే సత్తా ఉందని శివ నిరూపించారు. `మళ్లీ రావా` చిత్రంతో క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం నాని హీరోగా ` జెర్సీ` చిత్రం తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి పేరు మార్మోగుతోంది. జెర్సీ ట్రైలర్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంది. ఈ చిత్రంతో మరో విజయం అందుకుంటానన్న ధీమాని గౌతమ్ వ్యక్తం చేస్తున్నారు. అ! లాంటి ప్రయోగాత్మక చిత్రంతో విజయం అందుకున్న ప్రశాంత్ వర్మ కల్కి చిత్రంతో మరో క్లాస్సీ మూవీని తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన కల్కి టీజర్ మైమరిపించింది. రాజశేఖర్ ని `మగాడు` రేంజులో చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దేవరకొండకు `ట్యాక్సీ వాలా` రూపంలో హిట్టిచ్చిన రాహుల్ సాంకృత్యన్ టెక్నిక్ కి పేరొచ్చింది. అతడు తదుపరి చిత్రానికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉందింకా. విజయ్ దేవరకొండ హీరోగా `డియర్ కామ్రేడ్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న భరత్ కమ్మ పైనా అంచనాలున్నాయి. ఈ సినిమాతో హిట్ కొట్టి రైజింగ్ డైరెక్టర్ గా నిరూపించుకుంటాడనే భావిస్తున్నారు. `డియర్ కామ్రేడ్` త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. నవ్యపంథా కథాంశాల్ని ఎంచుకుని కొత్త దారిలో.. ప్రయోగాల బాటలో వెళ్లేందుకే నవతరం దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మారిన ట్రెండ్ లో అది కలిసొచ్చే అంశమే. కొన్నిసార్లు తడబడినా హిట్లు కొట్టే సత్తా, టెక్నిక్ ఉందని నిరూపించుకుంటే ఫ్లాపులొచ్చినా తిరిగి ఛాన్సులొస్తున్నాయ్. ఫ్లాపు డైరెక్టర్లు అయినా .. పరాజయాలపై సమీక్షించుకుని నవ్యపంథా స్క్రిప్టులతో తిరిగి రేసులోకి దూసుకొస్తారనే ఆశిద్దాం.