Begin typing your search above and press return to search.
సంక్రాంతి రేసు - ఎవరు బాసు
By: Tupaki Desk | 15 Dec 2018 7:26 AM GMTఇంకా సమయం ఉన్నప్పటికీ సినిమా ప్రేమికుల కళ్ళు జనవరిలో రాబోయే సంక్రాంతి సీజన్ మీదే ఉన్నాయి. క్రేజీ స్టార్ హీరోల సినిమాలు ఈ సారి వరసబెట్టి క్యూ కట్టడంతో ట్రేడ్ వర్గాలు సైతం కోట్లాది రూపాయల పెట్టుబడులతో పెద్ద గేమ్ ఆడబోతున్నాయి. ఎవరికెవరు తీసిపోరు అనే స్థాయిలో ఉండే హీరోలు బ్యానర్లు దర్శకులు కావడంతో ఇది ఎక్కువ ఇది తక్కువ అనే ఛాన్స్ ఈ సారి లేకుండా పోయింది. ముందుగా వస్తున్న ఎన్టీఆర్ మాత్రం ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. జనవరి 9న రిలీజ్ కానున్న ఎన్టీఆర్ మీద బాలకృష్ణ అభిమానులే కాదు సగటు ప్రేక్షకుడు కూడా చాలా ఆశిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడం పోస్టర్ల రూపంలో చేసిన పబ్లిసిటీ మంచి హైప్ ఇవ్వడం ఇవన్నీ ప్లస్ గా మారాయి. వంద కోట్ల దాకా ఓవరాల్ బిజినెస్ జరిగినట్టు టాక్ ఉంది.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామ అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా సినిమా కావడంతో పాటు రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు మాములుగా లేవు. కనివిని ఎరుగని రేట్లకు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు సమాచారం. వెంకటేష్ వరుణ్ తేజ్ ల ఎఫ్2 మొన్నటి దాకా సైలెంట్ గా ఉందే అనిపించినా ఒక్క టీజర్ మొత్తం వాతావరణాన్ని మార్చేసింది. చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్ టైనర్ చూడబోతున్న ఫీలింగ్ అందులో కలగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి ఆప్షన్ గా ఇదే ఉంటుందన్న నిర్మాత దిల్ రాజు అంచనా నిజమైనా ఆశ్చర్యం లేదు. హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పనితనం మీద ప్రేక్షకులకు సైతం మంచి నమ్మకం ఉంది.
సో సంక్రాంతి రేస్ లో ఎవరో ఒకరా లేక అందరా విజేతలుగా ఎవరుంటారు అనేదే ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మూడు పాజిటివ్ గా ఉన్నా సమస్య లేదు. సెలవుల సీజన్ కాబట్టి బాగున్నాయి అంటే అన్ని ఆడతాయి. కాకపోతే ఎవరికి ఎంత ఓపెనింగ్ వచ్చింది అనే లెక్కలు కీలకంగా మారతాయి. వినయ విధేయ రామ జనవరి 10 ఎఫ్2 జనవరి 12గా డేట్స్ ఫిక్స్ అయ్యాయనే టాక్ ఉంది కానీ యూనిట్స్ నుంచి ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది.