Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాల హాఫ్ సెంచరీ లెక్కలు

By:  Tupaki Desk   |   3 March 2016 5:30 PM GMT
సంక్రాంతి సినిమాల హాఫ్ సెంచరీ లెక్కలు
X
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ ఇరగదీసి ఆడేయడంతో.. డిస్ట్రిబ్యూటర్లు తెగ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే.. ఆ సంతోషాన్ని అన్ని సినిమాలు పూర్తిగా నిలబెట్టలేకపోయాయి. అయితే.. ఇప్పుడీ మూవీస్ కొన్ని చోట్ల యాభై రోజులు పూర్తి చేసుకున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సోగ్గాడే చిన్ని నాయన.. 110 సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది.

ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన నాన్నకు ప్రేమతో 16 సెంటర్లలోను, బాలకృష్ణ డిక్టేటర్ 3 థియేటర్లలోను అర్ధ శతదినోత్సవం జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం ఏ మూవీకైనా మొదటి రెండు వారాలు మినహాయించి.. ఇలా ఫిఫ్టీ డేస్ - హండ్రెడ్ డేస్ - సిల్వర్ జూబ్లీలపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు కానీ.. కొన్ని సెంటర్లలో ఫ్యాన్స్ ఆనందం కోసం రన్ చేస్తున్నారు. కొన్నిసార్లు తర్వాత వచ్చిన సినిమాలు మరీ ఘోరంగా ఫెయిలవడం కూడా కలిసొస్తోంది.

50 కోట్ల మార్క్ ను అందుకుని పెట్టుబడికి రెండింతలు పైగా రాబట్టిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని. బ్లాక్ బస్టర్ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కు తొలి యాభై కోట్ల చిత్రంగా నిలిచినా.. పెట్టుబడిని పూర్తిగా రాబట్ట లేకపోవడంతో.. యంగ్ టైగర్ మూవీ నాన్నకు ప్రేమతోను యావరేజ్ గానే పరిగణించారు. ఇక బాలకృష్ణ డిక్టేటర్ 20 కోట్ల షేర్ దగ్గర ఆగిపోయింది