Begin typing your search above and press return to search.
తగ్గుతున్న సీనియర్ స్టార్ హీరోయిన్ల జోరు!
By: Tupaki Desk | 10 March 2021 3:30 PM GMTఅందం .. అధికారం .. ఆకాశంలా ఎప్పటికి ఉండేవి కావు. అందం ఏ రోజుకు ఆ రోజు తగ్గిపోతూనే ఉంటుంది. అందువల్లనే కర్పూరం కరిగిపోయేలోగా దేవుడికి హారతి ఇచ్చేయాలి అన్నట్టుగా, అందం తరిగిపోయేలోగానే వెండితెరపై వెలిగిపోవాలనీ .. నాలుగురాళ్లు సంపాదించుకోవాలని హీరోయిన్లు ఆరాటపడుతుంటారు. ఉత్తరాదిన .. దక్షిణాదిన ఉత్సాహంగా సినిమాలను చుట్టబెట్టేస్తుంటారు. క్రేజ్ తగ్గుతున్న సమయంలో అప్పటివరకూ పెడుతూ వస్తున్న షరతులను సడలిస్తూ .. అవసరమైతే ఒక మెట్టుదిగుతూ వెళుతుంటారు. కొత్త హీరోయిన్ల నుంచి పోటీ పెరుగుతుంటే, పాత హీరోయిన్ల పరుగు తగ్గడం సహజమే కదా!
తెలుగులో శ్రియ .. త్రిష .. కాజల్ .. తమన్నా .. వీళ్లంతా కూడా కాస్త అటు ఇటుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. గ్లామర్ పరంగాను .. నటనపరంగాను తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అగ్ర హీరోల జోడీగా వరుస హిట్లను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లారు. వీళ్లందరి కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసిన హీరోయిన్ గా 'శ్రియ' కనిపిస్తుంది. అయితే కొంతకాలంగా తెలుగులో ఆమె కెరియర్ మసకబారుతూ వస్తోంది. ఆమె నుంచి రానున్న సినిమాగా 'గమనం' మాత్రమే కనిపిస్తోంది. ఆ సినిమాపై కూడా అంతగా బజ్ లేదు. ఇక తెలుగు తెరను ఒకప్పుడు అల్లాడించిన త్రిష, ఇక్కడి ప్రేక్షకులకు దూరమై చాలాకాలమే అయింది. 'నాయకి' తరువాత ఆమె తెలుగు సినిమా చేయలేదు. కోలీవుడ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె పరిస్థితి ఫరవాలేదన్నట్టుగానే ఉంది.
ఇక కాజల్ తెలుగులో చిరంజీవి సరసన నాయికగా 'ఆచార్య' సినిమా చేస్తోంది. ఇక్కడ ఆమె చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇదే. తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకి హీరోయిన్ల కొరత ఉండటం వలన ఆమెకి ఈ ఛాన్స్ దొరికిందనేవాళ్లు లేకపోలేదు. మంచు విష్ణు జోడీగా చేసిన 'మోసగాళ్లు' విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తరువాత కనుచూపు మేర మరో తెలుగు సినిమా అయితే కనిపించడం లేదు. ఇక తమిళంలో ఓ నాలుగు సినిమాలైతే చేతిలో ఉన్నాయి. మిల్కీ బ్యూటీగా అందరి నుంచి మంచి మార్కులు కొట్టేసిన తమన్నా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆమె చేతిలో ఉన్న సినిమాల్లో 'ఎఫ్ 3' తప్ప, గట్టిగా ఏదీ కనిపించడం లేదు. నిజం చెప్పాలంటే వీళ్లంతా కూడా గతంలో ఉన్న వాళ్ల క్రేజ్ కి సంబంధం లేని సినిమాలనే ఇప్పుడు ఎక్కువగా చేసుకుంటూ వెళుతున్నారు. వెలుగు ఉండగానే వెతుక్కోవాలి అనే కాన్సెప్టునే ఫాలో అవుతున్నారు.