Begin typing your search above and press return to search.

క్రిటిసిజం ఎందుకు.. స్కూల్ మొదలెట్టండి

By:  Tupaki Desk   |   3 Aug 2016 10:30 PM GMT
క్రిటిసిజం ఎందుకు.. స్కూల్  మొదలెట్టండి
X
ఇప్పుడు టాలీవుడ్ లో చెప్పుకుంటూ పోతే.. ఏ సినిమా సక్సెస్ మీటుకు ఏ వెటరన్ డైరక్టర్ ను పిలిచినా కూడా.. సెటైర్లు వేయడంలో ఎవ్వరూ తక్కువ కాదు అన్నట్లున్నారు. ఈ మధ్య కాలంలో తమ్మారెడ్డి భరద్వాజ - తరువాత ఏ.కోదండరామిరెడ్డి.. ఇప్పుడు లేటెస్టుగా దాసరి నారాయణరావు.. ఇలా అందరూ ఇప్పుడు వస్తున్న సినిమాల తాలూకు కథలపై చాలా పంచులే పేలుస్తున్నారు.

ఒక విధంగా చూస్తే.. ఇలాంటి పెద్దలు వేసే పంచుల్లోనూ నిజం లేకపోలేదు. ఇప్పుడు తెలుగు సినిమాల్లో కథలు అనేవే ఉండట్లేదు. ఒక క్వీన్.. బజరంగీ భాయిజాన్.. ఒక కత్తి.. సూదు కవ్వుం.. ఒక యు-టర్న్.. తిథి.. రంగీ తరంగి.. ఒక ప్రేమమ్.. ఉస్తాద్ హోటల్.. ఇతర బాషల్లో చాలా మాంచి సినిమాలు వస్తున్నాయి కాని.. తెలుగులో మాత్రం డిక్టేటర్.. సరైనోడు.. సర్దార్.. బ్రహ్మోత్సవం.. ఇలా అన్నీ స్టార్ డమ్ చుట్టూ తిరిగే సినిమాలే కాని.. కొత్తగా కథలు కనిపించే సినిమాలే రావట్లేదు. పెళ్ళి చూపులు సినిమా నెరేషన్ విషయంలో రిఫ్రెషింగ్ గా ఉండొచ్చేమో కాని.. కథ పరంగా పెద్ద గొప్పగా ఏమీ లేదు. అలాంటప్పుడు కథలు రావాలంటే ఏం చేయాలి?

బహుశా ఇప్పుడు క్రిటిసిజంకు మాత్రమే పరిమితమైన సీనియర్ డైరక్టర్లూ రైటర్లూ కూర్చుని కొన్ని కథలు వండాలి. లేదంటూ కథలు ఇలా వండాలి అంటూ ఏదన్నా ఒక స్కూల్ తెరిచి.. క్లాసులు చెబితే బెటర్. ఒక ప్రక్కన కె.ఆర్.ఆర్.క్లాస్ రూమ్ పేరిటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇప్పుడు కొన్ని సూచనలూ సలహాలూ ఇస్తున్నారు కదా. అలాగే మిగిలినవారు కూడా చేస్తే.. తెలుగులో కొత్త కథలు పుడతాయేమో. దర్శకుల మైండ్ సెట్ చేంజ్ అవుతుందేమో. ఏమంటారు సీనియర్లు?