Begin typing your search above and press return to search.

శాండల్ వుడ్ పై సీరియస్ స్ట్రాటజీ

By:  Tupaki Desk   |   11 March 2019 6:27 AM GMT
శాండల్ వుడ్ పై సీరియస్ స్ట్రాటజీ
X
ఇప్పుడంటే కన్నడ నుంచి వచ్చిన కెజిఎఫ్ సంచలన విజయం సాధించింది కానీ అక్కడి మూవీస్ మనదాకా రావడం దశాబ్దాల క్రితమే ఆగిపోయింది. వాటికి ఇక్కడ పూర్తిగా జీరో మార్కెట్ ఉండటమే కారణం. అందుకే కన్నడ ప్రభాకర్-దేవరాజ్-సుదీప్ లాంటి వాళ్ళు ఎంత పెద్ద స్టార్లు అయినా ఇక్కడ విలన్లుగా చేసేందుకు ఉత్సాహం చూపించారు. అయితే కర్ణాటకలో ఇప్పటిదాకా డబ్బింగ్ సినిమాలు నిషేధం. స్ట్రెయిట్ మూవీస్ కావాలంటే రిలీజ్ చేసుకోవచ్చు కానీ డబ్ చేయకూడదు.

ఇప్పుడు ఆ ఆంక్షలు లేవు. ఎత్తేశారు. దీన్ని ముందుగా వాడుకుంది అజిత్. వివేగం విశ్వాసంలను అనువదించి వదిలి మంచి లాభాలు చేసుకున్నారు. తెలుగు నుంచి రంగస్థలం మొదటగా డబ్బింగ్ రూపంలో అక్కడ అడుగు పెట్టబోతోంది. అయితే ఇది ఏడాది పాత సినిమా కాబట్టి కౌంట్ లోకి రాదని ట్రేడ్ మాట

ఇక అఫీషియల్ గా ఒకే తేదీకి తెలుగుతో పాటు కన్నడలో అడుగు పెడుతున్న సినిమా డియర్ కామ్రేడ్. రష్మిక మందన్న ఉండటంతో పాటు విజయ్ దేవరకొండ అక్కడివారికీ పరిచయం కాబట్టి మార్కెట్ బాగానే వస్తుందని ఆశిస్తున్నారు నిర్మాతలు. దీని తర్వాత ఈ ట్రెండ్ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సైరాను డబ్ చేయడం ఖాయం. మాములుగా మెగా స్ట్రెయిట్ మూవీస్ కె అక్కడ బ్రహ్మరధం పడతారు. అలాంటిది ఏకంగా కన్నడ బాష అంటే ఇక చెప్పాలా.

దానికి తోడు కిచ్చా సుదీప్ ఉన్నాడు కాబట్టి బయ్యర్లు ఎగబడి కొనడం ఖాయం. ఈ రెండే కాదు సాహో కూడా లైన్ లో ఉంది. ఇవి కనక రికార్డులు సృష్టిస్తే ఇక ప్రతి స్టార్ హీరో తెలుగు సినిమా అదే రోజు నేరుగా కన్నడ బాషలోకి వెళ్ళిపోతుంది. వసూళ్ళ పరంగా ఇంకా బెటర్ ఫిగర్స్ నమోదయ్యే ఛాన్స్ దొరుకుతుంది. మొత్తానికి టాలీవుడ్ సినిమాలకు సంబంధించి కన్నడ సీమలో తెలుగు సినిమాల ప్రభావం ఈ ఏడాది నుంచి గట్టిగానే ఉండబోతోంది