Begin typing your search above and press return to search.
టాలీవుడ్ ని ఒక్కసారిగా వణికించింది!
By: Tupaki Desk | 3 Aug 2022 2:30 AM GMTటాలీవుడ్ ఫ్లాపులతో పాటు హిట్ లని, సూపర్ హిట్ లని, బ్లాక్ బస్టర్లని చూస్తూ వస్తోంది. అయితే ఒక్కోసారి హిట్ లు, ఫ్లాపులు సమానంగా వస్తుంటాయి. కానీ ఏం చిత్రమో కానీ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కటంటే ఒక్క హిట్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది. ప్రతీ నెల చిన్నా పెద్దా అన్నీ కలిపి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయన్నది తెలిసిందే. అందులో ఏదో ఒక సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ గా నిలుస్తూ వస్తూ వుంటుంది.
కానీ జూలై నెలలో మాత్రం టాలీవుడ్ ఒక్కటంటే ఒక్క హిట్ ని కూడా సొంతం చేసుకోలేక షాక్ కు గురిచేసింది. ఈ నెలలో విడుదలైన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ లు, డిజాస్టర్లే అత్యధికంగా వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే జూలై నెల టాలీవుడ్ కు చుక్కలు చూపించిందని చెప్పొచ్చు.
ఈ నెలలో విడుదలైన ప్రతీ సినిమా వరుసగా ఫ్లాప్ అయి టాలీవుడ్ కు వణుకుపుట్టించాయి. స్టార్ హీరో సినిమాల నుంచి టైర్ 2, స్మాల్ హీరోల వరకు చాలా సినిమాలు థియేటర్లలో సందడి చేసినా ఏ ఒక్క సినిమా కూడా హిట్ అనే మాట వినిపించించలేక బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి.
మారుతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే టాక్ వుంది. అతని నుంచి థియేటర్లలోకి వచ్చిన `పక్కా కమర్షియల్`తో జూలై నెల శుభారంభాన్నిస్తుందని అంతా నమ్మకంతో ఎదురుచూశారు. కానీ జూలై 1న విడుదలైన ఈ మూవీ అందరి నమ్మకాన్ని వమ్ముచేసింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథని తీసుకుని మారుతి చేసిన ప్రయోగం ఫలించకపోగా పెద్ద షాకిచ్చింది. కెరీర్ టర్న్ అవుతుందని లావణ్య భారీ అంచనాలు పెట్టుకున్న `హ్యపీ బర్త్ డే` ఫలితం టీమ్ లో హ్యాపీ లేకుండా చేసింది.
భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేట్ అయినా సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ తరువాత జూలై 14న రామ్ `ది వారియర్` మూవీతో యాక్షన్ హీరోగా మాస్ ని మెప్పించాలని పవర్ ఫుల్ పోలీస్ పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే వరుస ఫ్లాపుల్లో వున్న దర్శకుడు లింగస్వామి ఈ మూవీతో తన ఫ్లాపుల పరంపరని కొనసాగించి రామ్ కు గట్టి షాకిచ్చాడు. ఇక నిఖిల్ `కార్తికేయ 2`రిలీజ్ ని అర్థాంతరంగా వెనక్కి నెట్టి జూలై 22న నాగచైతన్య `థాంక్యూ` అంటూ థియేటర్లలోకి వచ్చాడు.
దిల్ రాజు నిర్మాతగా, విక్రమ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చై కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. మూవీ టికెట్ ల పరంగా ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ అని ప్రకటిస్తూ థియేటర్ల ముందు బోర్డ్ లు పెట్టినా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ మూవీ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక నెలాఖరులో వచ్చిన `రామారావు ఆన్ డ్యూటి` కూడా సేమ్ ఫలితాన్ని అందించిన షాకిచ్చింది. రిలీజ్ కు ఈ మూవీతో మళ్లీ హిట్ లు మొదలవుతాయని ఆశిస్తే భారీ ఝలక్ తగిలింది. దీంతో జూలై నెల వరుస ఫ్లాలని అందించడమే కాకుండా కోట్లల్లో నష్టాల్ని అందించిన టాలీవుడ్ కు చుక్కలు చూపించిందని అంటున్నారు.