Begin typing your search above and press return to search.

షాకింగ్: మార్చి 1 - 2018 నుంచి టాలీవుడ్ స‌మ్మె!

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:37 PM GMT
షాకింగ్: మార్చి 1 - 2018 నుంచి టాలీవుడ్ స‌మ్మె!
X
వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సినిమాల నిర్మాత‌ల‌కు గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుంది. వ‌చ్చే ఏడాది మార్చి నుంచి టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసి స‌మ్మె చేయ‌బోతున్నారు. అయితే - గతంలో మాదిరిగా కేవలం ప్రొడ‌క్ష‌న్ - షూటింగ్ కార్య‌క్ర‌మాలే కాకుండా ఈ సారి థియేటర్ల‌ను కూడా మూసి వేయాల‌ని ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామర్స్ నిర్ణ‌యించుకుంది. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు(డీఎస్పీ) - నిర్మాత‌ల మండ‌లికి మ‌ధ్య విభేదాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. నిర్మాత‌ల మండ‌లి సూచ‌న‌ల‌ను డీఎస్పీలు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ విభేదాలు త‌లెత్తాయి. దీంతో - స‌మ్మె అనివార్య‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

2010లో కూడా ఇదే త‌ర‌హాలో నిర్మాత‌ల మండ‌లికి - సినీ కార్మికుల‌కు మ‌ధ్య వేత‌నాల విష‌యంలో విభేదాలు తలెత్త‌డంతో వారు స‌మ్మెకు పిలుపునిచ్చారు. అయితే, ఈ సారి వారంతా క‌లిసి డీఎస్పీల‌పై పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో - ప్రొజెక్ష‌న్ రూం లో నుంచి రీళ్ల ద్వారా సినిమా ను ప్ర‌ద‌ర్శించేవారన్న సంగ‌తి తెలిసిందే. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త నేప‌థ్యంలో వాటి స్థానంలో పాస్ వ‌ర్డ్ ల‌తో కూడిన‌ హార్డ్ డిస్క్ లు వ‌చ్చాయి. క్యూబ్ - యూఎఫ్ వో - పీ ఎక్స్ డీ వంటి సంస్థ‌లు ఆ డిజిటల్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అయితే, నిర్మాత‌ల మండలి తీసుకున్న నిర్ణ‌యాల ప్ర‌కారం డీఎస్పీలు న‌డుచుకోవ‌డం లేద‌ని - అందుకే వారంతా మార్చి 1 - 2018 నుంచి స‌మ్మెకు దిగబోతున్నామ‌ని ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామర్స్ ప్ర‌క‌టించింది. ఇండ‌స్ట్రీపై డీఎస్పీల గుత్తాధిప‌త్యం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌రి, ఈ స‌మ్మె నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది వేస‌వి బ‌రిలో దిగ‌బోతోన్న రంగ‌స్థ‌లం - నా పేరు సూర్య‌ - 2.ఓ - భ‌ర‌త్ అను నేను చిత్రాల విడుద‌ల‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ లోపు వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికితే వాటి విడుద‌ల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది.