Begin typing your search above and press return to search.

పుష్ప వేదిక నుండి టాలీవుడ్ తరపున వార్నర్ కు థ్యాంక్స్

By:  Tupaki Desk   |   13 Dec 2021 7:46 AM GMT
పుష్ప వేదిక నుండి టాలీవుడ్ తరపున వార్నర్ కు థ్యాంక్స్
X
ఈమద్య కాలంలో తెలుగు సినిమాల స్థాయి చాలా పెరిగింది. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలు అయ్యింది. తెలుగు లో విడుదల అయిన ప్రతి ఒక్క సినిమా గురించి బాలీవుడ్ వర్గాల వారు చర్చించడం.. రీమేక్ చేయడం లేదా డబ్బింగ్‌ చేయడం చేస్తున్నారు. స్టార్‌ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా ఒక మోస్తరు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలు చిన్న హీరోల కంటెంట్‌ ఓరియంటెడ్‌ చిత్రాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా బాలీవుడ్‌ వర్గాల వారిని ఆకర్షిస్తూనే ఉంది. ఇప్పుడు డేవిడ్ వార్నర్ వల్ల తెలుగు సినిమాల గురించి.. తెలుగు స్టార్స్ గురించి మొత్తం ప్రపంచం తెలుస్తోంది. ఈమద్య కాలంలో ఆయన తెలుగు సినిమా స్టార్స్ ను ఇమిటేట్‌ చేస్తూ చేసిన రీల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికే పలువురు హీరోల పాటలను మరియు ఫైట్స్ డైలాగ్స్ ను చెప్పిన డేవిడ్ వార్నర్‌ తాజాగా పుష్ప పాటతో మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచంకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఆయన వీడియోలు ఉంటున్నాయని అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడి తరపున.. టాలీవుడ్‌ తరపున వెంకీ కుడుముల పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి డేవిడ్‌ వార్నర్ కు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. తెలుగు సినిమా ల గురించి ప్రపంచానికి తెలియజేస్తున్న డేవిడ్‌ వార్నర్ మొన్నటి వరకు సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ జట్టులో ఉన్నాడు. ఆయన ఈమద్య కాలంలో ఆ జట్టుకు దూరం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే డేవిడ్ వార్నర్ కొత్త జట్టులోకి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

టిక్ టాక్ వీడియో లు మరియు ఇన్ స్టా గ్రామ్‌ రీల్స్ లో డేవిడ్‌ వార్నర్ తన ఫ్యామిలీ తో కలిసి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫన్నీ వీడియోలు.. సీరియస్ వీడియోలు.. మెసేజ్‌ వీడియోలు.. బ్రాండ్ ప్రమోట్‌ వీడియో లు ఎన్నో చేస్తూ ఉంటాడు. అలాంటి డేవిడ్‌ వార్నర్‌ కు పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి టాలీవుడ్‌ తరపున థ్యాంక్స్ చెప్పడం అనేది ఖచ్చితంగా ఆయన్ను గౌరవించడం అనడంలో సందేహం లేదు. ఐపీఎల్‌ లో ఆయన రాబోయే సీజన్ లో హైదరాబాద్‌ తరపున ఆడబోవడం లేదు అనే నిజం అభిమానులకు కాస్త చేదుగా ఉంది. ఆయన ఏ జట్టుకు ఆడినా కూడా ముందు ముందు రోజుల్లో కూడా ఆయన ఇండియన్ సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.