Begin typing your search above and press return to search.

బ్రూస్ లీ జాకీ చాన్ లా టాలీవుడ్ లో ఒక‌డున్నాడు!

By:  Tupaki Desk   |   15 July 2021 6:27 AM GMT
బ్రూస్ లీ జాకీ చాన్ లా టాలీవుడ్ లో ఒక‌డున్నాడు!
X
`సెప్టెంబ‌ర్ 2` ప‌వ‌నోత్స‌వానికి స‌మ‌య‌మాస‌న్న‌మైంది! ఇంకేం ఉంది.. ట్విట్ట‌ర్ ఇన్ స్టా స‌హా ప‌లు మాధ్య‌మాల్లో ప‌వ‌న్ బ‌ర్త్ డే హంగామా ఇప్ప‌టికే మొద‌లైపోయింది. అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసి సంబ‌రంగా మారుతోంది.

సోష‌ల్ మీడియాలు ఇప్ప‌టికే ప‌వ‌నిజంతో ఠారెత్తిపోతున్నాయి. పవన్ అభిమానులు త‌మ ఫేవ‌రెట్ స్టార్ వ్యక్తిగత వృత్తి గ‌త జీవితం గురించి ఆసక్తికరమైన విష‌యాలను పంచుకుంటున్నారు. నిజానికి ప‌వ‌న్ తాను న‌టించిన తొలి సినిమాలో రియ‌ల్ క‌రాటే ఫీట్స్ తో మ‌తి చెడ‌గొట్టారు. అప్ప‌ట్లోనే ప‌వ‌న్ కరాటే డెమో సెషన్ అభిమానుల్లో సంచ‌ల‌నంగా మారింది.

జాకీ చాన్.. బ్రూస్ లీ త‌ర‌హాలో టాలీవుడ్ లో ఒక‌డున్నాడ‌ని ఆనాడు మెగాభిమానుల్లో చ‌ర్చా సాగింది. చాలామంది తాము రియ‌ల్ స్టంట్స్ చేశామ‌ని చెప్పుకునే హీరోలు ఉన్నారు. డూప్ చేసిన‌వి త‌మ ఖాతాలో వేసుకుంటారు. కానీ ప‌వ‌న్ అలా కాదు .. త‌న సినిమాలో స్టంట్స్ కి త‌నే స్టంట్ కొరియోగ్రాఫ‌ర్.. రియ‌ల్ మార్ష‌ల్ ఆర్ట్స్ తో మైమ‌రిపించారు. అత‌డు న‌టించిన `అక్క‌డ అమ్మాయి- ఇక్క‌డ అబ్బాయి` చిత్రంలో లైవ్ మార్ష‌ల్ పెర్ఫామెన్స్ తో ప‌వ‌న్ త‌న స‌త్తా ఏంటో చూపించారు.

1997 లో ఓ డెమోలో భాగంగా పవన్ వేగంగా మీదికి దూసుకొస్తున్న మారుతి వ్యాన్ ను చేతుల‌తోనే ఆపాడు. పవన్ డేర్ డెవిల్ ఫీట్ తరువాత యువత‌లో ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అప్ప‌ట్లోనే హరి హర కళాభవన్ ఆడిటోరియం వెలుపల సమావేశమైన అతని అభిమానులు సికింద్రాబాద్ లో అతనికి అద్భుతమైన స్వాగతం ప‌లికారు. త‌న విద్య‌ల‌న్నిటినీ ప‌వ‌న్ తాను న‌టించే స‌న్నివేశాల్లో పాట‌ల్లోనూ ఆవిష్క‌రించారు. ప‌వ‌న్ స్వ‌త‌హాగానే మార్ష‌ల్ ఆర్ట్స్ నిపుణుడు కాబ‌ట్టి.. ఈ ప్రత్యేకమైన ధోరణి యూత్ ని విప‌రీతంగా ఆక‌ర్షించింది. అత‌డి రియ‌ల్ ట్యాలెంట్ ఇంత గొప్ప ఫాలోయింగ్ కి కార‌ణ‌మైంది. ఇక ప‌వ‌న్ సేవాగుణాన్ని వ్య‌క్తిత్వాన్ని విప‌రీతంగా అభిమానించే వారికి కొద‌వేమీ లేదు. నేడు ప‌వ‌నిజం వెన‌క ప‌వ‌న్ లో చాలా కోణాలు విశేషంగా ఆక‌ర్షించ‌డ‌మే కార‌ణం.

20 ఏళ్ల కెరీర్ లో తాపీగా పాతిక సినిమాలు మాత్ర‌మే చేసిన ప‌వ‌న్ ఇటీవ‌ల దూకుడు పెంచారు. రాజ‌కీయాల‌కు గ్యాప్ ఇచ్చి న‌టించిన రీమేక్ మూవీ వకీల్ సాబ్ ఘ‌న‌విజయం సాధించింది. త‌దుప‌రి `అయ్య‌ప్ప‌నుమ్ కోషియం` తెలుగు రీమేక్ స‌హా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` లాంటి హిస్టారిక‌ల్ మూవీలో న‌టిస్తున్నారు. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం బ‌హుభాషా చిత్రం. తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లో పాన్ ఇండియా కేట‌గిరీలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఏ.ఎం.ర‌త్నం నిర్మిస్తున్నారు. త‌దుప‌రి హ‌రీష్ శంక‌ర్.. సురేంద‌ర్ రెడ్డి స‌హా ప‌లువురు దర్శ‌కుల‌తో ప‌వ‌న్ ప‌ని చేయ‌నున్నారు. ప‌వ‌న్ ఈ లాక్ డౌన్ సీజ‌న్ లో బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అవ‌న్నీ ప్ర‌స్తుతం స్క్రిప్టింగ్ ద‌శ‌లో ఉన్నాయి.