Begin typing your search above and press return to search.
బాక్సాఫీస్ లెక్కల్లో అందరూ నెం.1 లే
By: Tupaki Desk | 14 April 2015 6:50 AM GMTటాలీవుడ్‌లో అరడజను పైగా స్టార్ హీరోలున్నారు. పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్ని, ప్రభాస్ పేర్లు టాప్ 10లో ఉంటాయి. అయితే వీళ్లలో నంబర్ 1 ఎవరు? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం అంత వీజీ కాదు. ఈ స్టార్లంతా బాక్సాఫీస్ దగ్గర కింగ్‌లే. తమకి ఉన్న ఇమేజ్‌తోనే తొలి మూడు రోజుల్లో 15కోట్లు పైగా వసూళ్లను రాబట్టే హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. వారం ఆడితే 40కోట్ల వసూళ్లు లాగేస్తున్నారు. అయితే తొలిరోజు టాక్‌ని బట్టి హెచ్చుతగ్గులుంటాయి అంతే.
ఇటీవలి కాలంలో రిలీజైన సినిమాలు సాధించిన వసూళ్లను పరిశీలిస్తే బాక్సాఫీస్ వద్ద హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా స్టార్ల సినిమాలు వసూళ్లు సాధించాయి. ఫ్లాప్ టాక్ వచ్చిన ఆగడు, మిక్స్‌డ్ టాక్ వచ్చిన గోవిందుడు అందరివాడేలే రెండూ ఒకేరోజు రిలీజై తొలి మూడు రోజుల్లో 16కోట్ల వసూళ్ల మార్క్‌ని తాకాయి. ఆగడు 16.6కోట్లు వసూలు చేస్తే గోవిందుడు 16కోట్లు వసూలు చేశాడు. అలాగే పవన్ నటించిన గోపాల గోపాల, ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలు వారం తేడాలో రిలీజయ్యాయి. గోపాల గోపాల తొలి మూడు రోజుల్లో 15.9కోట్లు వసూలు చేస్తే, టెంపర్ తొలి మూడు రోజుల్లో 16.7 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కల్ని పరిశీలిస్తే తొలివారం అందరూ నంబర్ వన్‌లే.
అయితే లాంగ్ రన్‌లో సినిమా సాధించే వసూళ్లను బట్టి హీరోలో స్టామినాని లెక్కించవచ్చు. కాని కథలో దమ్ము, సినిమాలో విషయం ఉంటేనే లాంగ్ రన్ సాధ్యమవుతుంది. కాబట్టి ఫలానా హీరో నెం.1 అని తేలిగ్గా చెప్పేయలేం. అభిమాన బలం, వసూళ్లు టాపర్‌ను నిర్ణయించడానికి పూర్తి కొలమానాలు కాదిప్పుడు. వాటికి అదనపు గణాంకాలెన్నో వచ్చేశాయి.