Begin typing your search above and press return to search.

కథలు కంప్లీట్ చేయాలంటే ఏళ్లు పడుతోంది

By:  Tupaki Desk   |   22 Sep 2016 10:30 PM GMT
కథలు కంప్లీట్ చేయాలంటే ఏళ్లు పడుతోంది
X
టాలీవుడ్ హీరోలు సినిమాలు బాగా నెమ్మదిగా చేస్తుంటారు. ఇందుకు కారణంగా.. సరైన కథలు దొరకడం లేదనే కథ వినిపిస్తూ ఉంటారు. ఇకపై ఆ పరిస్థితి మారనుందనే విషయం అర్ధమైపోతోంది. కథలు దొరకడం లేదనే మాట చెప్పడానికి ఇప్పట్లో ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు సరేనన్న సినిమాలు పూర్తి చేసేందుకే.. చాలామంది హీరోలకు అనేక సంవత్సరాలు పట్టనుంది. కథా రచయితలు.. డ్యాన్స్ మాస్టర్లు.. సినిమాటోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారనుండడంతో.. స్టోరీలు దొరకడం లేదనే సిట్యుయేషన్ లో మార్పు వచ్చేసింది.

ప్రస్తుతం మురగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత కొరటాలతో సినిమా చేస్తాడని అంటున్నారు. వీరు కాకుండా వంశీ పైడిపల్లి.. గౌతమ్ మీనన్.. త్రివిక్రమ్.. విక్రమ్ కె కుమార్ లతో సినిమా చేసేందుకు మహేష్ సై అన్నాడని తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే స్పీడ్ చూపిస్తున్నాడు. ధృవ కంప్లీట్ అయిపోయాక.. సుకుమార్ సినిమాని చెర్రీ ప్రారంభించనుండగా.. మణిరత్నం.. సంపత్ నంది.. మేర్లపాక మురళి.. గౌతమ్ మీనన్ లు కూడా ఇప్పటికే చరణ్ తో సినిమాకి ఓకే అనిపించేసుకుని వెయిట్ చేస్తున్నారు.

బాహుబలి పూర్తి చేసేందుకు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన ప్రభాస్.. త్వరలో సుజిత్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కొరటాలతో సినిమా చేస్తాడని అంటున్నారు. త్రివిక్రమ్- ప్రభాస్ మూవీ కూడా డిస్కషన్ లో ఉంది. హరీష్ శంకర్ తో దువ్వాడ జగన్నాథం చేస్తున్న అల్లు అర్జున్.. ఆ తర్వాత లింగుస్వామి.. విక్రమ్ కె కుమార్ లతో సినిమాలు చేస్తాడని టాక్. ఇక బాబీ కూడా ఓ స్టోరీ చెప్పాడని.. బన్నీ సై అన్నాడని అంటున్నారు.

జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఎన్టీఆర్ కోసం.. పూరీ జగన్నాథ్.. లింగుస్వామి.. వక్కంతం వంశీ.. తివిక్రమ్ లలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో అర్ధం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇక మీడియం హీరోలయిన చైతు.. అఖిల్.. శర్వానంద్.. నానిలు కూడా ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేస్తూ స్పీడ్ చూపిస్తున్నారు.

ఈ కథలన్నీ కంప్లీట్ కావాలంటే ఏళ్లు పడుతుంది. అందుకే మహేష్ లాంటి హీరో కూడా ఒకేసారి రెండు సినిమాలు చేయాలని నిర్ణయించాడని అంటున్నారు. త్వరలో బన్నీ కూడా ఇదే రూట్ పట్టనున్నాడు. ఇకపై మన స్టార్లకు కథలు లేవనే మాట చెప్పేందుకు ఛాన్స్ లేదనే మాట తేలిపోవడం లేదూ.