Begin typing your search above and press return to search.

పర్మీషన్‌ వచ్చినా స్టార్స్‌ కదలడం లేదు!

By:  Tupaki Desk   |   14 Jun 2020 7:30 AM GMT
పర్మీషన్‌ వచ్చినా స్టార్స్‌ కదలడం లేదు!
X
వైరస్‌ విజృంభిస్తున్నా కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్స్‌ కు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే. గత కొన్నాళ్లుగా షూటింగ్స్‌ లేక చాలా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం అయినా పర్మీషన్‌ ఇవ్వాలంటూ సినీ ప్రముఖులు ప్రభుత్వంకు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు షూటింగ్స్‌ కు పర్మీషన్‌ వచ్చాయి. అయితే సినిమాల షూటింగ్స్‌ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు.

సీరియల్స్‌ షూటింగ్స్‌ అయితే ప్రారంభం అయ్యాయి కాని సినిమా వారు సెట్స్‌ పైకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇప్పటి వరకు షూటింగ్స్‌ మొదలు పెట్టేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా స్టార్‌ హీరోలు అయితే ఇప్పట్లో సెట్స్‌ పైకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పలువురు హీరోలు ఇప్పటికే ఆగస్టు నుండి షూటింగ్‌ చేద్దామంటూ దర్శక నిర్మాతలకు సూచించినట్లుగా తెలుస్తోంది.

చిన్న హీరోలు కూడా ప్రస్తుతానికి షూటింగ్స్‌ వద్దన్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్‌ మునుపటితో పోల్చితే 80 శాతం తక్కువగా జరిగే అవకాశం ఉంది. రాబోయే రెండు మూడు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగచ్చు అంటున్నారు. సీరియల్స్‌ వాళ్లు మాత్రం తక్కువ మంది కాస్ట్‌ అండ్‌ క్రూతో షూటింగ్‌ చేస్తున్నారు. ఇన్ని రోజులు సినీ కార్మికుల కోసం షూటింగ్స్‌ కు పర్మీషన్‌ అడిగిన సినీ ప్రముఖులు కూడా ఇప్పట్లో సెట్స్‌ పైకి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.