Begin typing your search above and press return to search.
స్టార్ హీరోలు సీక్రెట్ వైజాగ్ ప్లాన్స్
By: Tupaki Desk | 4 Dec 2018 5:49 AM GMTవైజాగ్ టాలీవుడ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న సందర్భమిది. బీచ్ సొగసుల విశాఖ పరిసరాల్లో కొత్త టాలీవుడ్ పురుడు పోసుకుంటోందని ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా నమ్ముతున్నారు. అందుకు ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత ? అన్నది అటుంచితే ప్రజల్లో రంగుల ప్రపంచానికి సంబంధించిన ఘాడమైన ఆకాంక్ష నెలకొని ఉంది.
ఇదిలా ఉండగానే టాలీవుడ్ టాప్ స్టార్లంతా వైజాగ్‌ని విజిట్ చేయడం సంచలనంగా మారింది. అయితే వీళ్లంతా తరచూ విశాఖ నగరానికి ఎందుకు వెళుతున్నారు? అని ఆరా తీస్తే.. చాలా ఆసక్తికర సంగతులే బయటపడ్డాయి. నిజానికి ఇలా వైజాగ్ వెళుతున్న స్టార్లందరికీ విశాఖ బీచ్‌కి అత్యంత సమీపంలో కొన్ని భూములు (సైట్లు) ఉన్నాయి. ప్రఖ్యాత రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లో ఈ భూములు ఉన్నాయన్న సమాచారం ఉంది. అలాగే భీమిలి పరిసరాల్లో మెగాస్టార్ చిరంజీవి కి, మంచు హీరోలకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయన్న ప్రచారం ఉంది. గత ఆరేడేళ్లు గా ఈ ఏరియాల్లో భూముల పై పలువురు స్టార్ హీరోలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని .. అక్కినేని నాగార్జున సైతం అక్కడ భూములు కొన్నారని చెప్పుకున్నారు.
అదంతా అటుంచితే సదరు స్టార్ హీరోలంతా రెగ్యులర్ గా వైజాగ్ కి ఎందుకు విజిట్ చేస్తారు? అంటే రెండు పనుల పై అక్కడి కి వెళ్లి వస్తున్నారట. బీచ్ సొగసుల విశాఖ నగరంలో రెగ్యులర్ డెవలప్‌మెంట్స్, బిజినెస్‌లకు ఉన్న ఆస్కారం పరిశీలించేందుకు, రెండోది వృత్తిగత ఒత్తిడుల నుంచి బయటపడేందుకు అక్కడ ఉన్న ఓ ప్రఖ్యాత వెల్‌నెస్ సెంటర్‌ని విజిట్ చేసేందుకు వెళుతుంటారని తెలిసింది. ఈ వెల్ నెస్ సెంటర్ రామానాయుడు స్టూడియోస్ కి అత్యంత సమీపంలో ఉంది. ఇకపోతే ఆ వెల్‌నెస్ సెంటర్ ఒకప్పుడు హోటల్. కాలక్రమంలో వెల్‌నెస్ సెంటర్‌గా మారిందని తెలుస్తోంది. ఇక్కడే అగ్రనిర్మాత కే.ఎస్.రామారావు ప్రారంభించిన వైజాగ్ -ఎఫ్ఎన్‌సీసీ పాదుకొంది. ఇందులో ఇప్పటికే 250 మంది సభ్యులు ఉన్నారు. మొత్తానికి వైజాగ్‌లో మన స్టార్ హీరోలంతా స్పాట్ పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీలో ఎన్నికల తర్వాత రాబోవు ప్రభుత్వం ఏదైనా వైజాగ్ ని ఫిలింహబ్ గా మార్చేందుకు ఏం చేయబోతోందోనన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.