Begin typing your search above and press return to search.
సురేష్ బాబు హడావిడీ వెనక ఇంతుందా?
By: Tupaki Desk | 22 Sep 2022 6:25 AM GMTటాలీవుడ్ లో వున్న స్టార్ ప్రొడ్యూసర్ లలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు ఒకరు. సినిమా నిర్మాణం నుంచి పబ్లిసిటీ, థియేటర్లలో ఆ మూవీని రిలీజ్ చేసే వరకు ప్రతీ విషయంలోనూ పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ చక చకా పావులు కదుపుతుంటారు. పక్కా కమర్షియల్ పంథాలో ఆయన వేసే అడుగులు ప్రతీ ఒక్క మేకర్ ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సినిమాని ఎలాంటి థియేటర్లలో రిలీజ్ చేయాలి?.. ఎప్పుడు రిలీజ్ చేయాలి.. ఎలాంటి సినిమాని ప్రేక్షకులకు అతి తక్కువ బడ్జెట్ తో అందించి అత్యధిక లాభాల్ని దక్కించుకోవాలనే విషయాల్లో డి. సురేష్ బాబు తరువాతే ఎవరైనా.
దీంతో చాలా మంది ప్రొగ్యూసర్స్ ఆయనని ఫాలో అవ్వాలని, ఆయనలా సినిమాలు నిర్మించాలని, అదే తరహాలో రిలీజ్ చేయాలని చాలా మంది ప్రొడ్యూసర్ లు ప్లాన్ చేస్తుంటారు. అయితే గత కొంత కాలంగా సోలోగా సినిమాలు నిర్మించడం పక్కన పెట్టి ఇతర సంస్థలతో కలిసి భాగస్వామిగా వ్యవహరిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. కొరియన్ మూవీస్ ని కూడా ఇక్కడ రీమేక్ చేయిస్తూ హిట్ లని సొంతం చేసుకుంటున్నారు.
ఇదిలా వుంటే డి. సురేష్ బాబు ఇటీవల వ్యవహరిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురిచేస్తోంది. తన సినిమా రిలీజ్ అంటే చాలా ప్లాన్డ్ గా కూల్ గా చేసుకునే ఆయన ఈ మధ్య హడావిడీ చేస్తున్నారు.. తన పంథాకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తూ షాకిస్తున్నారు.
ఆయన సహ హభాగస్వామిగా వ్యవహరించిన లేటెస్ట్ మూవీ 'శాకిని డాకిని'. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ వారం తిరక్కుండానే థియేటర్లలోంచి వెళ్లిపోతోంది.
ఇదిలా వుంటే వెంటనే సురేష్ బాబు మరో సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. శ్రీసింహా హీరోగా నటించిన 'దొంగలున్నారు జాగ్రత్త' మూవీని ఇప్పుడు ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా వెంట వెంటనే తన రెండు సినిమాలని థియేటర్లలోకి సురేష్ బాబు తీసుకురావడానికి, ఇంత హడావిడి చేయడానికి గల కారణం ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదట. ఇదిలా వుంటే ఎప్పుడూ కూల్ గా సినిమాలని రిలీజ్ చేసే సురేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలని థియేటర్లలోకి తీసుకురావడానికి బలమైన కారణం వుందని తెలుస్తోంది.
ఈ రెండు సినిమాల ఓటీటీ డీల్ ఫినిష్ అయింది. అయితే ఈ మూవీలు థియేటర్లలో రిలీజ్ అయితేనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లు డీల్ క్లోజ్ చేస్తున్నాయట. ఆ కారణంగానే సేరేష్ బాబు హరీ బరీగా ఈ రెండు సినిమాలని థియేటర్లలో రిలీజ్ చేసేశాం అనిపించేశారట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా సురేష్ బాబు హడావిడీ వెనక ఇంత కథ వుందా? అని ఆశ్చర్యపోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.