Begin typing your search above and press return to search.
అనంతపురంలో సినీతారల క్రికెట్
By: Tupaki Desk | 5 Nov 2017 12:14 PM GMTఅసలే క్రికెట్.. ఆపై సినీతారలు.. ఇంకేముంది కుర్రకారు ఉత్సాహాన్ని ఆపడం సాధ్యమా? అనంతపురంలో ఇదే జరిగింది. సినీతారలు అక్కడ క్రికెట్ ఆడడానికి రావడంతో అభిమానులు సముద్రంలా పోటెత్తారు. అనంతపురం పట్టణంలోని నీలం సంజీవరెడ్డి స్డేడియంలో మ్యాచ్ ఆడేందుకు సినీతారలు రావడంతో స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.
శ్రీకాంత్ - తరుణ్ - అల్లరి నరేశ్ - ఆదర్శ్ - సంపూర్ణేశ్ బాబు సహా తదితర సెలబ్రిటీలను చూసేందుకు స్థానికులు రావడంతో స్డేడియంలో ఉత్సాహం ఉప్పొంగింది. హీరోయిన్లు అర్చన - ప్రణీతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సినీతారలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. కాగా 2011 నుంచి అనంతపురం వేదికగా సినీతారల క్రికెట్ కప్‌ను సీసీసీ చైర్మన్ షకీల్ షఫీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి టోర్నీని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి కాల్వ శ్రీనివాసులు టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. సినీతారలే ప్రధాన ఆటగాళ్లుగా తలపడనున్న మ్యాచ్‌లోని ఓ జట్టుకు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ కెప్టెన్ కాగా, మరో జట్టుకు కెప్టెన్‌గా హీరో తరుణ్ వ్యవహరించారు. 36 మంది సినీ తారలతో పాటు ఎంఎల్ఎన్ అకాడమీకి చెందిన సింగర్స్ పోటీల్లో పాల్గొంటున్నారు.