Begin typing your search above and press return to search.
BNR హిల్స్ మీద ఎగబడుతున్న సినీస్టార్స్!
By: Tupaki Desk | 2 Dec 2022 3:29 AM GMTభారీ పారితోషికాలను.. ఇతర వ్యాపార మార్గాల్లో ఆదాయాలను మన స్టార్లు రకరకాలుగా పెట్టుబడులుగా పెడుతుంటారు. అయితే సినీ సెలబ్రిటీల్లో మెజారిటీ శాతం రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టడాన్ని సురక్షితంగా భావిస్తుంటారు. నేటి రోజుల్లో గజం గజం భూమి ధర పెరుగుతూనే ఉంది. అది ముంబై బాంద్రా అయినా హైదరాబాద్ గచ్చిబౌళి- జూబ్లీహిల్స్- బంజారాహిల్స్ అయినా టూ కాస్ట్ లీ అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ సామాన్య మధ్యతరగతికి నో ఛాయిస్. ఇలాంటి చోట్ల సెలబ్రిటీలు భారీగా రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతుండడం ప్రతిసారీ చర్చల్లోకి వస్తోంది.
నిజానికి ముంబై బాంద్రా ఏరియాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్- కింగ్ ఖాన్ షారూక్ సహా ఖాన్ ల త్రయం.. అక్షయ్ కుమార్ లతో పాటు నేటితరం స్టార్ హీరోలంతా భారీగా పెట్టుబడులు పెట్టారు. బాంద్రా-జుహూ-అంథేరి లాంటి చోట్ల భారీ విల్లాలతో కూడుకున్న విలాసవంతమైన భవంతుల్లో వందల కోట్ల పెట్టుబడులు పెట్టారని మీడియా కథనాలు వెలువడ్డాయి.
అయితే టాలీవుడ్ సెలబ్రిటీలంతా హైదరాబాద్ ఫిలింనగర్ లో చాలా వరకూ సెటిలయ్యారు. బంజారాహిల్స్- జూబ్లీహిల్స్-అమీర్ పేట్- మణికొండ- పుప్పాల గూడ- గచ్చిబౌళి వంటి ఏరియాల్లో భారీగా రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టారని కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అవన్నీ బిజీ స్పేసెస్ గా మారాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే అతి భారీ మొత్తాలను ధారపోయాలి. అయితే ఇలాంటి వారందరికీ ఇప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ గా హైదరాబాద్ గచ్చిబౌళి నంది హిల్స్ కి సమీపంలో ఉన్న సువిశాలమైన BNR హిల్స్ కనిపిస్తోంది.
ఇక్కడ టాలీవుడ్ సెలబ్రిటీలు భారీగా రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెడుతున్నారని సమాచారం. బిఎన్ ఆర్ హిల్స్ నుంచి చూస్తే నగరంలో ప్రధానమైన గచ్చిబౌళి నంది హిల్స్.. భారీ లేక్ వ్యూ సహా ఇతర ఏరియాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అపార్ట్ మెంట్ల కొనుగోలు లాభదాయకమని సినీసెలబ్రిటీలు భావిస్తుండడం చూస్తుంటే ఈ ఏరియా మరో బాంద్రా కాబోతోందా? అన్న సందేహాలు కలగక మానవు.
జూబ్లీ హిల్స్- బంజారా హిల్స్ అయిపోయింది. ఇప్పుడు బిఎన్.ఆర్ హిల్స్ పై పడ్డారన్న గుసగుస వేడెక్కిస్తోంది. మాస్ మహారాజా రవితేజ- ప్రభాస్ లాంటి హీరోలతో పాటు స్టార్ ఫిలింమేకర్స్ అనీల్ రావిపూడి - కొరటాల శివ- వి.వి.వినాయక్- హరీష్ శంకర్- క్రిష్ లాంటి దర్శకులు..
నిర్మాత రామ్ తాళ్లూరి ఇక్కడ పెట్టుబడులు పెట్టారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిశ్రమ సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో మరో బాంద్రా - జుహూ ఏరియా గా బిఎన్.ఆర్ హిల్స్ పాపులరవుతోందన్నమాట. గతంలో మణికొండ- పుప్పాలగూడలో స్టార్లు టెక్నీషియన్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. సొంత ఇండ్లను నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు బిఎన్.ఆర్ హిల్స్ హాట్ స్పాట్ గా మారిందన్నమాట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.