Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ వ‌ర‌కూ సెట్స్ కి రాన‌న్న సూప‌ర్ స్టార్?

By:  Tupaki Desk   |   12 Jun 2020 4:15 AM GMT
డిసెంబ‌ర్ వ‌ర‌కూ సెట్స్ కి రాన‌న్న సూప‌ర్ స్టార్?
X
మ‌హమ్మారీ భ‌యం సామాన్యుల్లోనే కాదు.. సెల‌బ్రిటీల్లోనూ ఆ రేంజులోనే ఉంది. అన‌వ‌స‌ర‌మైన రిస్క్ తీసుకునేందుకు హీరోలు ఎవ‌రూ ఆస‌క్తిగా లేరు. పెండింగ్ షూటింగులు పూర్తి చేసి సినిమాల్ని రిలీజ్ చేసుకోవాల‌న్న కంగారు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఉందేమో కానీ స్టార్ల‌కు అస‌లు ఎంత‌మాత్రం లేదు. `బ‌తికి ఉంటే బ‌లుసాకు తిని బ‌తుకుదాం!` అన్న తీరుగానే ఉంది హీరోల వ్య‌వ‌హారం.

ఆ క్ర‌మంలోనే సెట్స్ కి ర‌మ్మ‌ని పిలిస్తే ప‌లువురు టాలీవుడ్ హీరోలు నిర్మాత‌ల‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్. ఇప్ప‌ట్లో సెట్స్ కి రాలేం.. మ‌హ‌మ్మారీకి వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూద్దాం! అనేస్తున్నార‌ట‌. టాలీవుడ్ కి చెందిన ఒక సూప‌ర్ స్టార్ అయితే డిసెంబ‌ర్ వ‌ర‌కూ సెట్స్ కి రాలేన‌ని ఖరాకండిగా చెప్పేశార‌ట‌. ఆయ‌న ఇచ్చిన జోల్ట్ కి ఎంతో ఆత్రంలో ఉన్న స‌ద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు షాక్ త‌గిలింద‌ట‌. అయితే ఆ సూప‌ర్ స్టార్ కి పెండింగ్ ప్రాజెక్టులేవీ లేవు. కొత్త మూవీ టైటిల్ ప్ర‌క‌టించేసి.. లాంఛ‌నంగా మూవీని ప్రారంభించేశారు. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు ఎటెండ్ కావాల్సి ఉంది. కానీ స‌సేమిరా అనేశార‌ట‌.

సెట్స్ కి రండి సారూ అని పిలిస్తే .. ముందుగా త‌న‌పై సీన్స్ చిత్రీక‌రించ‌వ‌ద్ద‌ని చెప్పార‌ట‌. డిసెంబ‌ర్ నాటికి అందుబాటులోకి వ‌స్తాన‌ని చెప్పార‌ట‌. అంటే.. సారొచ్చేవ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే! నంటూ టీమ్ డైల‌మాలో ప‌డిపోయింది పాపం. అయితే ఎంత సార్ అయితే మాత్రం.. ప్రాణ భ‌యం లేకుండా ఉంటుందా? అస‌లే అది ఊపిరాడ‌నివ్వ‌ని మ‌హ‌మ్మారీ. నిత్యం వంద‌లాది కేసులు ఒక్క హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోనే న‌మోద‌వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కేసులు అంత‌కంత‌కు హీటెక్కిస్తున్నాయి. అదుపు అన్న‌దే లేకుండా మెంట‌లెక్కిస్తోంది.

ఈ వైరస్ కి సామాన్యులు సెల‌బ్రిటీలు అన్న తేడాలేం లేవు. సాక్షాత్తూ దేశాధ్య‌క్షుల్నే చుట్టుముట్టేసింది. అలాంటిది హీరోల్ని వ‌దులుతుందా? అందుకే స‌ద‌రు సూప‌ర్ స్టార్ డిసెంబ‌ర్ వ‌ర‌కూ వేచి చూడాల‌న్న కండీష‌న్ పెట్టార‌ట‌. ఇప్పుడు చేసేదేం లేక సందిగ్ధంలో ప‌డిపోయింద‌ట టీమ్.

ఎలానూ ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెర‌వరు. తెరిచినా జ‌నం రారు. అలాంట‌ప్పుడు కంగారు ప‌డి ఏం ఉప‌యోగం? అన్న వెర్ష‌న్ కూడా టాలీవుడ్ హీరోల్లో ఉంద‌ట‌. అందుకే షూటింగుల‌కు వ‌చ్చి లేనిపోనిది అంటించుకోవ‌డం ఎందుకు? అన్న భ‌యాందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోందిట‌. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల్ని పాటిస్తూ ఎలానూ షూటింగులు చేయ‌డం కుద‌ర‌ని ప‌ని. అందువ‌ల్ల కూడా ఆందోళ‌న‌లో ఉన్నార‌ట‌.