Begin typing your search above and press return to search.
ఐశ్వర్యను పక్కన పెట్టేసిన టాలీవుడ్.. ఆ పొరపాట్లే కారణమా?
By: Tupaki Desk | 4 Feb 2022 1:30 AM GMTప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈమె తండ్రి రాజేష్ ఒకప్పుడు తెలుగులో దాదాపు యాబైకి పైగా చిత్రాల్లో నటించారు. అలాగే ప్రముఖ సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి ఐశ్వర్యకు మేనత్త అవుతుంది. అయితే మంచి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఐశ్వర్య మాత్రం స్వయంకృషితోనే ఎదిగింది.
తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐశ్వర్య.. అక్కడ ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో శివ కార్తీకేయన్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు.
2019లో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించడమే కాదు.. ఐశ్వర్య తన నటనకు గానూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో మరిన్ని అవకాశాలు దక్కించుకున్న ఐశ్వర్య రాజేష్.. మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, భూమిక, టక్ జగదీష్, రిపబ్లిక్ చిత్రాలు చేసింది. కానీ, వీటిల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.
కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్లే ఐశ్వర్యకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. ఇక ఇప్పుడు ఆ కారణంగానే సరైన సక్సెస్ రేట్ లేని ఐశ్వర్యను టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో పెద్దగా తెలుగు చిత్రాలేమి లేవు.
అయితే తమిళంలో మాత్రం `డ్రైవర్ జమునా`, `మోహన్‌దాస్` చిత్రాలను చేస్తున్న ఐశ్వర్య రాజేష్.. మరోవైపు మలయాళంలో `పులిమడ` అనే మరో సినిమాలోనూ నటిస్తోంది. మరి ఇక ముందైనా ఐశ్వర్య ఏదో ఒక మ్యాజిక్ చేసి తెలుగులో ఆఫర్లను దక్కించుకుంటుందో..? లేదో..? చూడాలి.