Begin typing your search above and press return to search.

క్రాక్ టైమ్ లో సీనే మ‌ళ్లీ రిపీట‌వుతోందా?

By:  Tupaki Desk   |   11 Jan 2022 3:30 AM GMT
క్రాక్ టైమ్ లో సీనే మ‌ళ్లీ రిపీట‌వుతోందా?
X
క్రాక్ రిలీజ్ స‌మ‌యంలో కోవిడ్ ప్ర‌భావంతో 50శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ అయ్యింది. అయినా హిట్ అయ్యింది. ర‌వితేజ‌ను తిరిగి ప‌ట్టాలెక్కించిన ఆ రిజ‌ల్ట్ ఆశ్చ‌ర్య‌పరిచింది. ఓవైపు కోవిడ్ భ‌యాలు ఉన్నా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. 50శాతం ఆక్యుపెన్సీతోనే హిట్ట‌వ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇప్పుడు బంగార్రాజు స‌న్నివేశం అలానే ఉంది. ఓమిక్రాన్ భ‌యాల నడుమ ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. అయితే సంక్రాంతి సీజన్ ఈ సినిమాకి క‌లిసొస్తుందా లేదా? అన్న‌ది ఇంకా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఓవైపు ఏపీలో టికెట్ ధ‌ర‌ల త‌గ్గింపు స‌మ‌స్య పెద్ద‌గా ఉంది. అయినా తాను గ‌ట్టెక్కేస్తాన‌ని నాగార్జున ధీమాగా ఉన్నారు.

బంగార్రాజుతో పాటు మ‌రో రెండు చిన్న సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. రౌడీ బాయ్స్ .. హీరో సినిమాలు డెబ్యూ హీరోలు న‌టించిన‌వి. అయితే ఇందులో రౌడీ బాయ్స్ కి దిల్ రాజు బ్యాకింగ్ పెద్ద ప్ల‌స్ కానుంది. కాలేజ్ యూత్ సినిమా కాబ‌ట్టి యువ‌త‌రం గ‌ట్టెక్కిస్తుంద‌నే భావిస్తున్నారు. అయితే ఆ రెండు సినిమాల‌తో పోలిస్తే బంగార్రాజు రేంజు వేరు కాబ‌ట్టి వ‌సూళ్లు కూడా అంతే ఘ‌నంగా తేవాలి. సుమారు 40 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం అంత పెద్ద మొత్తం వెన‌క్కి తేవాలి అంటే బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డంతో పాటు కోవిడ్ టెన్ష‌న్స్ లేకుండా ఉండాలి. ఓవైపు 50శాతం ఆక్యుపెన్సీ.. నైట్ క‌ర్ఫ్యూలు.. మ‌రోవైపు ఓమిక్రాన్ ఫియ‌ర్స్ న‌డుమ‌ .. ఏం జ‌రుగుతుందో చూడాలి.