Begin typing your search above and press return to search.
అందనంత ఎత్తులో రాజమౌళి
By: Tupaki Desk | 27 Aug 2015 11:59 AM GMTఓ దర్శకుడు టాలీవుడ్ చరిత్రను తిరగరాశాడు.. ఓ సినిమా తెలుగు సినిమా గణాంకాల్ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా ‘బాహుబలి’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా రాకముందు వరకు కలెక్షన్ల రికార్డుల మాటెత్తితే చర్చ హీరోల చుట్టూనే తిరిగేది. కానీ ఇప్పుడు స్టార్లను మించిన ఇమేజ్ తో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు రాజమౌళి. మామూలుగా ఓ సినిమా వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తే వాటిని హీరో ఖాతాలోకే వేసేవారు. కానీ బాహుబలి విషయంలో ఆ పరిస్థితి లేదు. క్రెడిట్ అంతా రాజమౌళికే కట్టబెట్టాల్సిందే. అదే న్యాయం కూడా. అందుకే ఎన్నడూ లేని విధంగా ఓ దర్శకుడు ఇమేజ్ పరంగా, రికార్డుల పరంగా హీరోలకు, దర్శకులకు మధ్య కూడా పోటీ పెట్టాల్సి వస్తోంది.
బాహుబలి మాత్రమే కాదు.. అంతకుముందు ఈగ, మగధీర లాంటి సినిమాల సక్సెస్ క్రెడిట్ కూడా రాజమౌళిదే అనడంలో సందేహం లేదు. సినిమా సినిమాకూ తన ఇమేజ్ ను అమాంతం పెంచేసుకుంటున్న రాజమౌళి.. స్టార్ హీరోలెవరూ సాహసం చేయలేని రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నాడు. గత ఐదు సినిమాల షేర్ లెక్కగట్టి ఏవరేజ్ తీస్తే రాజమౌళికి దరిదాపుల్లో కూడా ఏ స్టార్ హీరో లేడు. బాహుబలిలో భాగమైనందుకు ప్రభాస్ మాత్రం జక్కన్న తర్వాతి స్థానం ఆక్రమించగలిగాడు. మిగతా స్టార్ హీరోలు రాజమౌళిలో సగం వసూళ్లు కూడా రాబట్టలేదు. టాప్-10లో నలుగురు దర్శకులుండటం విశేషం. ఇందులో సీనియర్ హీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లకు చోటే లేదు. మెగా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు టాప్-10లో ఉండటం విశేషం.
గత ఐదు సినిమాల షేర్ సగటు తీస్తే ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారంటే..
1. రాజమౌళి (ఐదు సినిమాల షేర్ రూ.475 కోట్లు- సగటున ఒక్కో సినిమాకు రూ.95 కోట్లు)
2. ప్రభాస్ (రూ.408 కోట్లు- సగటు రూ.81.6 కోట్లు)
3. మహేష్ బాబు (రూ.230 కోట్లు- సగటు రూ.46 కోట్లు)
4. పవన్ కళ్యాణ్ (రూ.229.5 కోట్లు- సగటు రూ.45.9 కోట్లు)
5. అల్లు అర్జున్ (రూ.214 కోట్లు- సగటు రూ.42.4 కోట్లు)
6. త్రివిక్రమ్ శ్రీనివాస్ (రూ.212 కోట్లు- సగటు రూ.42.4 కోట్లు)
7. రామ్ చరణ్ (రూ.203 కోట్లు- సగటు రూ.40.6 కోట్లు)
8. ఎన్టీఆర్ (రూ.185 కోట్లు- సగటు రూ.37 కోట్లు)
9. శ్రీను వైట్ల (రూ.176 కోట్లు- సగటు రూ.35.2 కోట్లు)
10. వి.వి.వినాయక్ (రూ.148 కోట్లు- సగటు రూ.29.6 కోట్లు)