Begin typing your search above and press return to search.

మన స్టార్ డైరెక్టర్లు ఏం చదివారు?

By:  Tupaki Desk   |   10 Sep 2015 6:10 PM GMT
మన స్టార్ డైరెక్టర్లు ఏం చదివారు?
X
చదువు అబ్బకుంటే సినిమాల్లోకి వెళ్లమని ఎద్దేవా చేస్తుంటారు జనాలు. కానీ చదువు రాకుంటే సినిమాల్లోకి వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు చాలామంది దర్శకులు బాగా చదువుకున్నాకే సినిమాల్లోకి వస్తున్నారు. మన టాలీవుడ్ దర్శకుల్లో చాలామంది ఉన్నత చదువులు చదివి సినిమాల్లోకి వచ్చిన వారే. వారి పేర్ల వెనుక మనం ఊహించని డిగ్రీలున్నాయి. అలా ఉన్నత చదువులు చదివిని కొందరు దర్శకుల వివరాలు ఇవిగో..

* త్రివిక్రమ్ ఆంధ్రా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు. గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు. మ్యాథ్స్, సైన్స్ టీచర్ గా కూడా పని చేశాడు.

* సుకుమార్ రాజోలు ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాకినాడలోని ఆదిత్య కళాశాలలో లెక్కల మాస్టారిగా పని చేశాడు.

* శేఖర్ కమ్ముల హైదరాబాద్ లోని సీబీఐటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత న్యూజెర్సీలో కంప్యూటర్స్ లో గ్రాడ్యుయేషన్ చదివాడు. ఆపై హోవర్డ్ యూనివర్శిటీలో ఎంఎఫ్ ఏ చేశాడు.

* శ్రీకాంత్ అడ్డాల ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేశాడు. ఐఐటీ ఢిల్లీలో పీహెచ్ డీ చేస్తూ సినిమాల మీద మనసు మళ్లడంతో మధ్యలో వదిలేశాడు.

* క్రిష్ బీఫార్మసీ చదివాక.. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు. ‘ఫస్ట్ కౌన్సల్’ పేరుతో ఓవర్సీస్ ఎడుకేషనల్ కన్సల్టన్సీ ఏర్పాటు చేశాడు.

* రవిబాబు చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంగ్లిష్ లిటరేచర్ లో గ్రాడ్యుయేషన్ చదివాడు. పుణె లోని సింబాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో ఎంబీఏ కూడా పూర్తి చేశాడు.

* అవసరాల శ్రీనివాస్ మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ చేశాడు. ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబరేటరీలో పని చేశాడు.

* ఇంద్రగంటి మోహనకృష్ణ లయోలా కళాశాలలో ఆర్ట్స్ లో డిగ్రీ చదివాడు. ఆపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఇంగ్లిష్, ఫిలాసఫీలో మాస్టర్ చేశాడు. టొరంటో బేస్డ్ యార్క్ యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ కూడా చదివాడు.

* మధుర శ్రీధర్ వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ చదివాడు. ఐఐటీ మద్రాస్ లో ఎమ్మెస్ పూర్తి చేయడమే కాక ఉప రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ కూడా అందుకున్నాడు.

* దేవా కట్టా మెకానికల్ ఇంజినీరింగ్ లో ఎమ్మెస్ చేశాడు. జనరల్ మోటార్స్ లో వెహికల్ క్రాష్ వర్తినెస్ ఇంజినీర్ గా కూడా పని చేశాడు.