Begin typing your search above and press return to search.

రూమర్: లక్ష్మితో మేము సైతం అనట్లేదే?

By:  Tupaki Desk   |   17 Oct 2016 5:30 PM GMT
రూమర్: లక్ష్మితో మేము సైతం అనట్లేదే?
X
యాక్టర్ కం హోస్ట్ అయిన మంచు లక్ష్మి.. ఇప్పుడు ఓ ఛారిటీ షో నిర్వహిస్తోంది. కమర్షియల్ ప్రోగామ్స్ మధ్యలో.. ఓ ఛారిటీ షోని కమర్షియల్ గా వయబుల్ గా నిర్వహించడం అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ మేము సైతం సక్సెస్ ఫుల్ గా సాగుతుండడం చూస్తే.. ఈ షో ఎంత సక్సెస్ సాధించిందో అర్ధమవుతుంది.

అయితే.. ఈ మేముసైతం కార్యక్రమాన్ని రెండు ఫ్యామిలీలు పక్కన పెట్టేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖమైన ప్రాధాన్యత ఉన్న ఆ రెండు కుటుంబాల నుంచి హీరోలెవరూ.. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న షోకి రావడం లేదు. అర డజన్ మంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి ఒకే కుర్రాడు వచ్చాడంతే. మరో కుటుంబం నుంచి అయితే.. ఆ మాత్రం అటెండెన్స్ కూడా లేదు. నిజానికి మేముసైతం కార్యక్రమంలో భాగం కావాలని.. మంచు లక్ష్మి స్వయంగానే ఇన్వైట్ చేసిందట. పర్సనల్ గా మంచు లక్ష్మికి.. ఆయా హీరోల ఫ్యామిలీలకు మంచి రిలేషన్స్ ఉన్న.. టెలివిజన్ షో విషయంలో మాత్రం నైస్ గా తప్పించేసుకుంటున్నారట. మరి ఆ రెండు కుటుంబాల నుంచి ఎవరైనా పెద్ద హీరోలు అటెండ్ అయితే ఈ రూమర్స్ తొలగిపోతాయ్ కానీ.. ఇదేమీ అంత తేలికైన విషయంగా అనిపించడం లేదు.

నిజానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు.. ఈగోలను పక్కనెట్టేసి అందరూ మేము పైతం అంటేనే బాగుంటుంది. ఏమంటారు గయ్స్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/