Begin typing your search above and press return to search.
జాతీయ మార్కెట్ పై టాలీవుడ్ అగ్రనిర్మాత ఫోకస్
By: Tupaki Desk | 13 Sep 2021 2:30 AM GMTటాలీవుడ్ లో అగ్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తూ మరోవైపు నవతరం హీరోలను ఎంకరేజ్ చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫోకస్ ప్రస్తుతం జాతీయ మార్కెట్ పై కి మళ్లినట్టే కనిపిస్తోంది. ఆయన వరుసగా హిందీలో రీమేక్ చిత్రాలతో దూసుకెళుతున్నారు. మరోవైపు హిందీ నిర్మాతలతో కలిసి లోకల్ గా సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఇంకోవైపు శంకర్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో జాతీయ స్థాయిలో ఓ ఊపు ఊపే సినిమాని ప్రారంభించాడు. తదుపరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించేందుకు పాన్ ఇండియా మార్కెట్లను ఒడిసిపట్టేందుకు బిగ్ స్కెచ్ వేశారని కథనాలొస్తున్నాయి.
ఇటీవలే తన కెరీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నిర్మించి ఎంతో హ్యాపీ ఫీలయిన దిల్ రాజు .. పవన్ వకీల్ సాబ్ తర్వాతా వరుసగా అగ్ర హీరోలతో సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఇవన్నీ భారీ కాన్వాసుతో అసాధారణ మార్కెట్లలో విడుదల కానున్నవే. ఇప్పటికే జెర్సీ రీమేక్ తో హిందీ పరిశ్రమలో అడుగుపెడుతున్న దిల్ రాజు.. ఇప్పుడు రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ మూవీ ఆర్.సితో ఉత్తరాదిన ట్రెండ్ సెట్టింగ్ నిర్మాతగా పాపులర్ కానున్నారని అంచనా ఏర్పడింది.
ఇంతలోనే 2020 సూపర్ హిట్ థ్రిల్లర్ HIT - ది ఫస్ట్ కేస్ హిందీ రీమేక్ ని నేటి ఉదయం అధికారికంగా ప్రారంభించారు. చిత్ర హీరో రాజ్‌కుమార్ రావు దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను నిర్మాతలు దిల్ రాజు భూషణ్ కుమార్ ఈ లాంచింగ్ వేడుకలో పాల్గొన్నారు. హిట్ లో దంగల్ బ్యూటీ సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. రెగ్యులర్ షూట్ త్వరలో ముంబైలో ప్రారంభమవుతుంది. క్రిషన్ కుమార్ - కుల్దీప్ రాథోడ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇక హిందీ డెబ్యూని ఘనంగా ఆరంభించిన దిల్ రాజుకు ఓటీటీ సంస్థల నుంచి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఇక హిందీ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు కొడితే అతడి రేంజు మరింతగా పెరుగుతుంది. దిల్ రాజు నిర్మించే తెలుగు చిత్రాలకు కూడా ఇతర మార్కెట్లలో డిమాండ్ అసాధారణంగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. చరణ్ తో ఆర్.సి 15 ఒక పాన్ ఇండియా మూవీ.. తదుపరి ప్రభాస్ తో పాన్ ఇండియా చిత్రమే. ఇవి రెండూ రిలీజైతే ఆకాశమే హద్దుగా అగ్రనిర్మాత దిల్ రాజు దూసుకుపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నాళ్లు పరిశ్రమ నాకు ఇచ్చింది. ఇప్పుడు పరిశ్రమకే నేను ఇస్తాను అనే స్థాయిలో ఎదిగారు ఆయన. ఇప్పుడు తిరిగి కొంత ఇచ్చేస్తున్నారని అనుకోవచ్చు!!
ప్రభాస్ తో భారీ ప్రయోగం..!
ప్రభాస్ నటించే 25వ సినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు లాక్ చేశారన్న వార్త ఒక ప్రకంపనం. ప్రభాస్ తో డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాక దిల్ రాజు మరో సినిమా చేయాలని ఎంతో కాలంగా వేచి చూస్తున్నాడు. ప్రభాస్ ఎప్పుడో కమిట్ మెంట్ ఇచ్చినా ఇన్నాళ్లు కుదరలేదు. అందుకే ఈసారి యువి క్రియేషన్స్ ని పక్కనపెట్టి దిల్ రాజు కు 25వ సినిమా ఆఫర్ ఇచ్చాడని కథనాలొచ్చాయి. ప్రభాస్ 25 కోసం అతడు ఎంపిక చేసుకున్న టైటిల్ కానీ నేపథ్యం కానీ ఆద్యంతం ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే `వ్రిందావన` అనే టైటిల్ ని ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన దిల్ రాజు పాన్ ఇండియా కేటగిరీలో కథాంశాన్ని సిద్ధం చేయించాడని తెలిసింది. ప్రభాస్ తో దిల్ రాజు 2023 చివరలో ఈ సినిమాను ప్రారంభిస్తారట. దర్శకుడు కథానాయిక ఎవరు.. అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు.