Begin typing your search above and press return to search.
దాసరికి బడా నిర్మాత అన్ని కోట్లివ్వాలా?
By: Tupaki Desk | 6 Jun 2017 7:59 AM GMTదర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి నుంచి ఇంకా టాలీవుడ్ పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి సమయంలోనే ఇండస్ట్రీలో ఉండిపోయిన ఆయన డబ్బుల గురించి బోలెడన్ని కొత్త సంగతులు తెలుస్తున్నాయి. సహజంగా నోటి మాట మీదే సినిమాలకు చాలానే అప్పులు ఇస్తుంటారు దాసరి. అది కూడా నామమాత్రపు వడ్డీకే.
టాలీవుడ్ లోని ఓ బడా నిర్మాత.. దాసరికి భారీ మొత్తంలో బకాయి పడ్డాడట. దాదాపు అందరు టాప్ స్టార్ హీరోలతోను సినిమాలు తీసిన ఆయన.. దాసరి నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు తీసుకున్నారని అంటున్నారు. కొంతమంది ఈ మొత్తం 12 కోట్లు అని కూడా అంటున్నారు. ఇంత భారీ మొత్తం తీసుకుని కూడా చాలా కాలమే గడించిందని టాక్. దాసరి ఆరోగ్యంగా ఉన్నపుడే.. ఆయన ఫోన్ కాల్స్ కు ఈ నిర్మాత ఆన్సర్ ఇచ్చేవాడు కాదట. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ లో బాగా యాక్టివ్ గా ఉన్న ఈ ప్రొడ్యూసర్.. కొన్నేళ్లుగా సినిమాల నిర్మాణం.. వహించడం లేదు.
2011లో ఈ నిర్మాత చివరగా సినిమా చేశాడు. ఓ స్టార్ హీరోతో చేసిన ఈ మూవీ చివరకు ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం మళ్లీ నిర్మాణం ప్రారంభించేందుకు టాప్ హీరోల డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మరి ఇప్పుడు దాసరి నారాయణరావుకు ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో ఈ నిర్మాత ఏం చేస్తాడనే ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/