Begin typing your search above and press return to search.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఆ నాలుగేనా?
By: Tupaki Desk | 3 Nov 2022 10:30 AM GMTటాలీవుడ్ లో ఎన్నో ప్రొడక్షన్ కంపనీలున్నాయి. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్, క్రియేటివ్ కమర్షియల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గీతా ఆర్ట్స్ 2, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, దుర్గా ఆర్ట్స్, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్, యువీ క్రియేషన్స్.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్.. ఇలా చాలా ప్రొడక్షన్ కంపనీలున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అందులో కొన్ని ప్రొడక్షన్ కంపనీలు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ లైమ్ లైట్ లో వున్నాయి.
సురేష్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్, గీతా ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సినిమాల నిర్మాణం దాదాపుగా ఆపేసి చాలా కాలమవుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలు ఇతర సంస్థలతో కలిసి గత కొంత కాలంగా సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇక సోలోగా సినిమాలు నిర్మిస్తున్న సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్, యువీ క్రియేషన్స్.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వంటి సంస్థలు సోలోగా సినిమాలు నిర్మిస్తున్నాయి.
ఇందులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్న సంస్థలు చాలా తక్కువే వున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్2, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్, యువీ క్రియేషన్స్.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్.. వంటి సంస్థలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో నిలుస్తున్న నిర్మాణ సంస్థలు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, యువీ క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ 2 ఈ నాలుగు ప్రొడక్షన్ హౌస్ లు మాత్రమే.
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు దాదాపు ఏడు సినిమాలున్నాయి. అందులో చిరు నటిస్తున్న `వాల్తేరు వీరయ్య`, బాలకృష్ణ తో చేస్తున్న `వీర సింహారెడ్డి` సినిమాలున్నాయి. త్వరలో `పుష్ప 2`ని ప్రారంభించనుండగా పవన్ కల్యాణ్ తో `భవదీయుడు భగత్ సింగ్ ` సెట్స్ పెళ్లి వెళ్లాల్సి వుంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో పవన్ తో ఒక మూవీ, ప్రభాస్ - మారుతిల ప్రాజెక్ట్ లున్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విజయ్ తో వారీసు, రామ్ చరణ్ - శంకర్ ల కలయికలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ తో యువీ క్రియేషన్స్ భారీ ప్రాజెక్ట్ చేయబోతోంది..గీతాఆర్ట్స్ 2 లో బ్యాక్ టు బ్యాక్ చిన్న హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. అప్పుడప్పుడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమాలు చేస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రస్తుతం మహేష్ బాబు - త్రివిక్రమ్ లతో ఓ భారీ మూవీకి ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇటీవలే `డీజే టిల్లు` కు సీక్వెల్ గా `టిల్లు స్క్వేర్` ని సిద్దూ జొన్నలగడ్డతో ప్రారంభించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.