Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మ‌ళ్లీ 'జూన్' దుమారం!

By:  Tupaki Desk   |   6 Jun 2022 2:30 PM GMT
టాలీవుడ్ లో మ‌ళ్లీ జూన్ దుమారం!
X
జ‌నాల్లో కోవిడ్ భయం పూర్తిగా తొల‌గిపోయింది. జ‌న‌జీవ‌నం యాధావిధిగా కొన‌సాగుతోంది. మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుత‌న్నాయని..బాలీవుడ్ సెల‌బ్రిటీలు మ‌ళ్లీ వైర‌స్ బారిన ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. కానీ అల‌వాటైన ప్రాణాలు కాబ‌ట్టి ప్ర‌స్తుతానికి కోవిడ్ని అంతా లైట్ తీసుకుంటున్నారు. కొంచెం గ‌తంలోకి వెళ్తే ..

కోవిడ్ ఎలా ఒణికించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో సినిమా ప‌రిశ్ర‌మ ఎంత‌గా చితికి పోయిందో తెలిసిందే. మాస్క్ లు ..శానిటైజ‌ర్లు ప‌ట్టుకుని థియేట‌ర్ల‌కి వెళ్లాల్సిన ప‌రిస్థితి. సీటు వ‌దిలి సీటులో కూర్చోవాల్సిన దుస్తితి నుంచి మెల్ల‌గా ఎలాగూ భ‌య‌ట‌ప ప‌డ్డాం. ఈ క్ర‌మంలో సినిమా థియేట‌ర్లో స‌క‌మ్రంగాను రిలీజ్ జ‌ర‌గ‌లేదు.

గ‌డిచిన రెండేళ్ల‌లో థియేట‌ర్ రిలీజ్ లు ఏమాత్రం ఆశాజ‌న‌కంగా లేవు. ఎలాంటి భ‌యాందోళ‌న‌ల‌కు లేకుండా సినిమా రిలీజ్ చేసే ప‌రిస్థితి లేదు. మార్చి నుంచి సినిమాలకు ఎలాంటి ఆట‌కం లేకుండా రిలీజ్ అవుతున్నా బ‌ల్క్ గా రిలీజ్ అయితే జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ జూన్ నెల అందుకుంటుంది. ఈనెలంతా రిలీజ్ ల‌తో పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది.

ఈనెల మొద‌టి వారంలో 'మేజ‌ర్' తో పాటు కొన్ని డ‌బ్బింగ్ సినిమాలు రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. 'విక్ర‌మ్'..'మయూరాక్షి'.. 'స‌మ్రాట్ పృథ్వీరాజ్' ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఇక వ‌చ్చే వారం ఈజాబితా మ‌రింత పెర‌గనుంది. 'అంటే సుందరానికీ'.. 'సురాపానం'..' జ‌రిగిన క‌థ' లాంటి స్ర్టెయిట్ చిత్రాల‌తో పాటు డ‌బ్బింగ్ సినిమాలు '777 చార్లీ'.. 'జురాసిక్ వ‌ర‌ల్డ్ డొమీనియ‌న్' తో పాటు ఇంకొన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

అలాగే 19న 'గాడ్సే'... 'విరాట ప‌ర్వం'..' కె-3' ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఇక జూన్ చివ‌ర్లో ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 23న 'కొండా' ..24న 'స‌మ్మ‌త‌మే'.. '7 డేస్ ..6 నైట్స్'..'ఒక ప‌థ‌కం ప్ర‌కారం'.. 'గ్యాంగ్ స్ట‌ర్ గంగ రాజు'.. 'టెన్త్ క్లాస్ డైరీస్'.. 'హుషారు'.. 'స‌దా న‌న్ను న‌డిపే' ..'సాప్ట్ వేర్ బ్లూస్' చిత్రాలు థియేటర్లోకి రాబోతున్నాయి.

గ‌డిచిన రెండేళ్ల‌లో ఈ రేంజ్ లో సినిమాలు థియేట‌ర్లో రిలీజ్ కాలేదు. కోవిడ్ ముందు వ‌ర‌కూ ఈ ఒర‌వ‌డి కొన‌సాగింది. కోవిడ్ ప్రారంభంతో ఆ దూకుడు క‌నుమ‌రుగైపోయింది. కానీ తాజా రిలీజ్ లు చూస్తుంటే మ‌ళ్లీ పాత రో జులు వ‌చ్చిన‌ట్లే క‌నిపిస్తుంది. అయితే తెలుగులో చిన్న స్థాయి సినిమా.. నిర్మాణం మాత్రం ఇంకా కోలుకోలేదు.

కోవిడ్ రాక‌తో చాలా సినిమాలు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి. కొన్ని షూటింగ్ ద‌శ‌లో ఆగిపో గా..మ‌రికొన్ని ల్యాబ్ లో ఉండిపోయాయి. వాటిని పూర్తిచేసి రిలీజ్ చేయ‌లేక నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇలాంటి వాటికి ప్ర‌భుత్వం ముందుకొచ్చి ప్రోత్సాహం అందించాల‌ని నిర్మాత‌లు కోరుతున్నారు.