Begin typing your search above and press return to search.
తదుపరి కుమ్మేసేది ఎవరు నాయనా!!
By: Tupaki Desk | 22 July 2016 9:30 PM GMTటాలీవుడ్ లో బాక్సాఫీస్ కళకళ్లాడి చాలా కాలం అయిపోతోంది. అ..ఆ.. మూవీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రాండ్ సక్సెస్ సాధించాడు. ఈ మూవీతో నితిన్ తొలిసారిగా 50 కోట్ల మార్క్ దాటాడు. ఆ తర్వాత వచ్చిన హిట్ మూవీ జెంటిల్మన్ అయినా.. దీని రేంజ్ 20 కోట్ల దగ్గరే ఆగిపోయింది. జెంటిల్మన్ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది.. థియేటర్లకు రప్పించలేకపోయింది.
తాజాగా రిలీజ్ అయిన రజినీకాంత్ మూవీ కబాలిపై.. చాలానే అంచనాలుండడంతో.. ఈ సినిమా 50కోట్లకు చేరుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ కారణంగా.. రెండో రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతాయనే అంచనాలు ఏర్పడ్డాయి. మరి తర్వాత బాక్సాఫీస్ ని కుమ్మేసే సత్తా ఎవరికుంది? వచ్చే నెలలో బాబు బంగారం అంటూ వెంకీ వస్తున్నాడు. తర్వాత ప్రేమమ్ తో నాగ చైతన్య కూడా వచ్చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే ఉన్నా.. 50 కోట్ల మార్క్ ని అందుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఒకవేళ నితిన్ టైపులో క్లిక్కయితే.. అ..ఆ టైపులో పండగే పండగ
ఇక కబాలి తరువాత పెద్ద సినిమా అంటే జనతా గ్యారేజ్ ఒక్కటే. ఇప్పటికే 65+ కోట్ల బిజినెస్ అయినట్లు కొన్ని లెక్కలు చెబుతున్నాయి. హిట్టయితే ఖచ్చితం ఒక 70 మార్కు టచ్చవుతుందని అంచనా. ఇక దసరా లోపు థియేటర్లలోకి వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి కానీ.. గ్యారేజ్ తరువాత రేంజున్న సినిమా రామ్ చరణ్ ధృవ ఒక్కటే. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి.. అస్సలు కామెంట్ చేయలేంలే. కాకపోతే ఈసారి మనోడు మళ్ళీ సునాయసంగా 50 కోట్ల క్లబ్బులోకి వెళతాడని తమిళ వర్షెన్ ఒక కాన్ఫిడెన్సు ఇస్తోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలను కూడా పెద్దగా నమ్మలేకపోతున్నాం. చూద్దాం మరి.