Begin typing your search above and press return to search.
సౌత్ హీరోల్ని కొట్టేందుకు సౌత్ విలన్లే
By: Tupaki Desk | 5 Jan 2016 7:30 PM GMTముంబై నుంచి విలన్లు వచ్చి మన సౌత్ హీరోలతో ఢీకొట్టేవారు. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు ముంబై నుంచే కాదు మన సౌత్ నుంచి కూడా విలన్లు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి విలన్లు దూసుకొస్తున్నారు. మన స్టార్ హీరోల సినిమాల్లో ధీటైన విలనీ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో సంపత్ రాజ్ ఫేమస్. పంజా - దమ్ము - మిర్చి .. ఒకటేమిటి డజన్ల కొద్దీ సినిమాల్లో నటించాడు. ఒక్క 2015లోనే ఆయన నటించిన 5 సినిమాలు సౌత్ లో రిలీజయ్యాయి. సోగ్గాడ చిన్నినాయనా - జై బాలయ్య సినిమాల్లో సంపత్ రాజ్ విలన్ గా నటిస్తున్నాడు.
మరో విలన్ బాబి సింహా తెలుగు హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ఓ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో పినిశెట్టి ఆది విలన్ గా కనిపిస్తున్నాడు. అలాగే తని ఒరువన్ రీమేక్ తో చరణ్ సినిమాలో విలన్ గా అరవింద స్వామి నటిస్తున్నారు. ఇప్పటికే బ్రూస్ లీ మూవీలో అరుణ్ విజయ్ (నటుడు విజయ్ కుమార్ తనయుడు) విలన్ గా నటించారు. వీరంతా ఫ్యూచర్ లో పెద్ద విలన్లుగా టాలీవుడ్ లో సెటిలైనా ఆశ్చర్యం అక్కర్లేదు.
ఒకప్పుడు రఘువరన్ - నాజర్ లాంటి విలన్లు తమిళ్ నుంచే వచ్చి తెలుగులో పాపులర్ అయ్యారు. సంపత్ ఇప్పటికే ఫేమస్ విలన్ . ఆ స్థాయిలో మిగతా కుర్ర విలన్ లు ఇక్కడ పేరు తెచ్చుకుని ఎదగాలని ఆశిద్దాం.