Begin typing your search above and press return to search.

కళ్ళన్నీ సూపర్‌స్టార్‌ ఆడియోపైనే

By:  Tupaki Desk   |   14 July 2015 8:17 AM GMT
కళ్ళన్నీ సూపర్‌స్టార్‌ ఆడియోపైనే
X
బాహుబలి రికార్డులతో చెలరేగిపోతుంటే మరోవైపు ఈ సినిమా రికార్డుల్ని కొట్టే వేరొక సినిమా ఏం వస్తుంది? అన్న లెక్కలేస్తున్నారు ఫిలింనగర్‌ జనాలు. చూస్తుంటే ఈ రికార్డుల్ని కొట్టాలంటే మరో దశాబ్ధం ఆగాలేమో? అన్న సందేహాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత రిలీజ్‌కి వస్తున్న అతి భారీ సినిమాలేం ఉన్నాయి? రికార్డుల్ని తిరగరాసే సత్తా ఎవరికైనా ఉందా? అన్న లెక్కలు వేస్తున్నారు.

రుద్రమదేవి 3డి వస్తున్నా జనాల్లో అంచనాల్లేవ్‌. మహేష్‌కి బాక్సాఫీస్‌ మహారాజుగా పేరు ఉంది కాబట్టి శ్రీమంతుడు ఏమైనా ఊపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే బాహుబలి రేంజులో వసూళ్ల వర్షం కురిపించాలంటే ఆషామాషీ కాదు. ఇప్పట్నుంచి శ్రీమంతుడు ఫీవర్‌ని ప్రేక్షకాభిమానుల్లో రాజేయాల్సి ఉంటుంది. ఘట్టమనేని అభిమానుల్లో జ్వరం వచ్చేలా చేయగలగాలి. రిలీజ్‌కి ముందు బాహుబలికి ఎంత హైప్‌ క్రియేట్‌ చేశారో.. అంతకుమించి హైప్‌ క్రియేట్‌ చేయగలగాలి. అంతేనా బాహుబలిలో కొట్టొచ్చినట్టు కనిపించిన ప్రతి నెగెటివ్‌ పాయింట్‌ని ఎన్‌క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి బాహుబలికి ఆడియో పెద్ద మైనస్‌. ఒక్క పచ్చ బొట్టేసి పాట తప్ప ఇంకేదీ హిట్టవ్వలేదు. కాబట్టి ముందుగా శ్రీమంతుడు ఆడియోతో కొట్టొచ్చు.

ఈనెల 18న మహేష్‌-కృష్ణ ఫ్యాన్స్‌ సమక్షంలో ఆడియో వేడుక ఘనంగా జరగనుంది కాబట్టి, అప్పట్నుంచే హైప్‌ పెంచుకోగలగాలి. పాటలు బావున్నాయి. మ్యూజిక్‌ సూపర్‌హిట్‌ అన్న టాక్‌ వస్తే కొంతమేరకు బాహుబలి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది. లేదు రొటీనే అంటే వసూళ్లు కూడా రొటీనే అయిపోతాయి. కాబట్టి శ్రీమంతుడు ఎలాంటి ప్లాన్‌తో వస్తాడు? సంగీతంలో దేవీశ్రీ ఏం చేస్తాడో? వేచి చూడాల్సిందే.