Begin typing your search above and press return to search.
జై బాలయ్యకు.. జూనియర్ ఆన్సర్?
By: Tupaki Desk | 23 Dec 2015 8:05 AM GMTస్టార్ ల ఫంక్షన్లలో తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ నినాదాలు చేయడం సాధారణమే. బాలయ్య అభిమానులు ఈ విషయంలో చాలా ముందుంటారు. జై బాలయ్య - జైజై బాలయ్య - జిందాబాద్ బాలయ్య - సీఎం బాలయ్య అంటూ రకరకాల నినాదాలతో తమ హీరోను కీర్తిస్తుంటారు. బాలకృష్ణ కూడా వీటిని సావధానంగా వింటుంటారు. ఇతర హీరోల ఫంక్షన్లలోనూ బాలయ్య అభిమానుల హంగామా కనిపిస్తోందిపుడు.
రీసెంట్ గా షేర్ ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ లకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో మేమందరం ఒకటే ఫ్యామిలీ అంటూ కళ్యాణ్ రామ్ స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లోనూ ఇదే సీన్ కనిపిస్తుందని అంచనా వేయచ్చు. మరి బాబాయ్ తో అబ్బాయ్ కి అంతగా సత్సంబంధాలు లేవు. కొన్ని నెలలుగా యంగ్ టైగర్ ఎక్కడా బాలయ్య పేరు ప్రస్తావించలేదు. పైగా బాలకృష్ణతో సంక్రాంతి ఫైట్ కి సిద్ధమంటూ డైరెక్ట్ వార్ అనౌన్స్ చేశాడు. మరి ఇలాంటి సమయంలో జరగనున్న ఆడియో ఫంక్షన్ లో బాలయ్య కోసం నినాదాలు ఖచ్చితంగా ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టేవే. అవి తీవ్రం అయితే జూనియర్ వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది.
ఇలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కల్పించారు. బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ లో ఇబ్బంది పెడితే.. నాగబాబు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. లోఫర్ ఫంక్షన్ లో ఇబ్బంది పెట్టినపుడు.. ప్రభాస్ ఐలైక్ పవర్ స్టార్ అనాల్సి వచ్చింది. మరి ఇప్పుడు బాలయ్య అభిమానులను శాంతపరచడానికి ఎన్టీఆర్ ఎలాంటి స్లోగన్ - స్టేట్ మెంట్ ఇస్తాడో అనే ఆసక్తి టాలీవుడ్ లో కొనసాగుతోంది.