Begin typing your search above and press return to search.
2016లో ఇలాంటి మార్పు రావాలి
By: Tupaki Desk | 3 Jan 2016 5:30 PM GMTసినిమా అంటేనే క్రియేటివిటీ. క్రియేటివిటీలోనూ బోలెడంత కొత్తదనం అవసరం. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారాలి. కొత్త రక్తం రావాలి. కొత్తదనం తేవాలి. అలా ఏమేం కావాలి? ఏ మార్పులు రావాలి? అని ప్రశ్నిస్తే అత్యధికుల సూచనలివి...
సినిమా 24 శాఖల్లో మహిళలు పనిచేయాలి. పురుషాధిక్య ప్రపంచం మారాలి. లేడీస్ .... దర్శకత్వం - స్ర్కిప్టు రైటింగ్ - సినిమాటోగ్రఫీలోనూ నిరూపించుకోవాల్సి ఉందింకా.
కారవ్యాన్ ని కేవలం హీరో కోసమే కాదు, దర్శకులకు కూడా అవసరం. పరిశ్రమలో హీరోకి ఉన్న ప్రాధాన్యత ముందు ఇతరులకు ఉన్న ప్రాధాన్యత చాలా తక్కువ. ఈ విషయంలో మార్పు రావాలి.
లైట్ మెన్ - స్పాట్ బోయ్స్ వంటి వారికి పారితోషికాలు చాలా తక్కువ. కాబట్టి హీరో పారితోషికం నుంచి కొంత కేటాయించి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. అలాంటి మార్పు సాధ్యపడాలని కోరుకుందాం. అలాగే హీరో క్లోజప్ లకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించి, కంటెంట్ పైనే దృష్టి సారించాలి. దానికనుగుణంగానే హీరోని చూపించాలి.
ప్రమోషన్‌తో పాటు ఆన్ లొకేషన్ కి హీరో కంటే ముందే హీరోయిన్ రావాలి. మిగతావాళ్లంతా రావాలి. కానీ హీరో గారికోసం అందరూ వెయిట్ చేయాలి. ఇలాంటి బ్యాడ్ ఫేజ్ నుంచి బైటపడాలి. ఔట్ డోర్ షూటింగులోకి హీరోకి తప్ప ఇతరులకు ఫెసిలిటీస్ అంత కరెక్టుగా ఉండవు. ఇదీ మారాలి.
ఇక నుంచి టీవీ లో వచ్చే కంటెంట్ కూడా మారాలి. సినిమా తర్వాత టీవీకే బోలెడంత ఆదరణ. రొటీన్ స్టఫ్ నుంచి బైటపడి సంథింగ్ కొత్తగా ఉండే ఎటెంప్ట్స్ చేయాలి. క్రియేటివ్ గా పీక్స్ కి వెళ్లాలి.
ఇండియన్ కల్చర్ - బయోపిక్స్ - ఫాంటసీ జోనర్ లో విస్ర్తతంగా సినిమాలు రావాలి. రొటీన్ మాస్ సినిమాల కంటే వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి.