Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: ఎన్టీఆర్ రియల్ స్టామినా ఇది

By:  Tupaki Desk   |   6 Sep 2016 4:16 AM GMT
టికెట్ కౌంటర్: ఎన్టీఆర్ రియల్ స్టామినా ఇది
X
బాక్సాఫీస్ చాలాకాలంగా కలెక్షన్స్ సునామీ కోసం ఎదురుచూస్తోంది. కబాలిపై పెట్టుకున్న ఆశలు రెండ్రోజులకు కలలుగా మారిపోవడంతో.. అప్పటి నుంచి యంగ్ టైగర్ పైనే ఆశలు పెట్టుకున్న ఇండస్ట్రీకి.. ఆ రోజు రానే వచ్చింది.

1. జనతా గ్యారేజ్: అనుకున్న డేట్ కు ఓ రోజు ముందే వచ్చినా మొదటి రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపించేశాడు ఎన్టీఆర్. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ.. వీకెండ్ ముగిసేనాటికే 50 కోట్ల మార్క్ ను అందుకుని తన సత్తా చాటాడు. ఇంత ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ మార్క్ ను అందుకున్న సినిమాగా జనతా గ్యారేజ్ రికార్డుల్లోకి ఎక్కేసింది.

2. అకీరా: టాలీవుడ్ బాక్సాఫీస్ అంతా ఎన్టీఆర్ హంగామా నడుస్తున్నా.. మురుగదాస్ డైరెక్షన్ లో సోనాక్షి సిన్హా నటించిన బాలీవుడ్ మూవీ అకీరాకి నైజాం ఏరియాలో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో అకీరా తన సత్తా చూపించింది.

3. పెళ్లిచూపులు: ఐదో వారం కూడా లోబడ్జెట్ మూవీ పెళ్లిచూపులకు మంచి వసూళ్లే దక్కాయి. పెట్టిన పెట్టుబడికి.. వచ్చిన వసూళ్లకి పొంతన లేని రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ సాధించగా.. ఇంకా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే స్క్రీన్ లలో ప్రదర్శితమవుతోంది.

4. శ్రీరస్తు శుభమస్తు: అల్లు శిరీష్ మూవీ శ్రీరస్తు శుభమస్తు నాలుగో వారాల తర్వాత కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది. గీతా ఆర్ట్స్ మూవీ కావడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్ కౌంట్ ఉండడం కలిసొచ్చే విషయంగా చెప్పచ్చు. మౌత్ టాక్ బాగుండడం.. ఫ్యామిలీ కంటెంట్ కావడంతో శ్రీరస్తు కలెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి.

5. బాబు బంగారం: వెంకటేష్- మారుతిల కాంబినేషన్ లో వచ్చిన బాబు బంగారం ఇంకా చాలా ఏరియాల్లో సేఫ్ జోన్ లోకి రాలేదు. ఇప్పడు జనతా గ్యారేజ్ చాలా థియేటర్లను ఆక్యుపై చేసేయడంతో.. ఇక ఆ ఆశలు కూడా దాదాపు లేనట్లేనని చెప్పాలి. వేరే సినిమాలేవీ థియేటర్లలో లేకపోవడంతో.. బాబు బంగారానికి అంతో ఇంతో వసూళ్లు మాత్రం వస్తున్నాయి.