Begin typing your search above and press return to search.

ఆ రైటర్ హైజాకింగ్ మానేశాడా??

By:  Tupaki Desk   |   9 July 2017 5:02 AM GMT
ఆ రైటర్ హైజాకింగ్ మానేశాడా??
X
టాలీవుడ్ ను పీడించే ఒకానొక పెద్ద సమస్య ఏంటంటే.. ఇక్కడ ఎవరు పడితే వారు ఏం రాసినా ఏం తీసినా కూడా.. ఆ క్రెడిట్ అంతా వేరొకరి ఎకౌంట్ లో వెళిపోతుంటుంది. ఉదాహరణకు ఒక స్టార్ రైటర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తుంటే.. ఎంతటి గొప్ప సీన్లు డైలాగులూ రాసినా కూడా అవన్నీ ఆ రైటర్ ఖాతాలోకే వెళతాయి.

అయితే ఇక్కడ పని నేర్పిస్తూ అలా చేస్తే ఓకె కాని.. ఒక రైటర్ తిమింగళం మాత్రం ఊరికినే అసిస్టెంట్ల టాలెంట్ మింగేస్తుంటాడు. అసిస్టెంట్లదే కాదు.. తాను ఎవరైనా కొత్త దర్శకుడికి ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టాడనుకోండి.. వెంటనే కథ తనదేనని మాటలు తనవేనని స్ర్కీన్ ప్లే తనదేనని.. అబ్బో క్రెడిటంతా హైజాక్ చేసి లాగేస్తాడంతే. కాని ఈ మధ్య కాలంలో కాస్త గట్టిగా పంచులు తగలడంతో మనోడు రూటు మార్చినట్లు అనిపిస్తోంది. గతంలో తానే ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమాకు మనోడు డైరక్టర్ ను హైజాక్ చేసి అంతా తానే అన్నట్లు వ్యవహరించాడు. చివరకు ప్రమోషన్లలో కూడా పాపం ఆ దర్శకుడు ఎక్కడా కనిపించలేదు. కాని ఇప్పుడు ఒక సినిమాకు మాత్రం.. మనోడు అస్సలు కెమెరా ముందుకు రాకుండా.. సదరు దర్శకుడినే ప్రమోట్ చేస్తున్నాడు. ఎట్టకేలకు తను చేస్తున్న తప్పేంటో ఈ సీనియర్ స్టార్ గ్రహించినట్లున్నాడు. లేదంటే ఈ సినిమా అసలు తన స్థాయి సినిమా కాదనుకుని ఇలా ప్రమోట్ చేస్తున్నాడో తెలియదు మరి.

ఏదేమైనా కూడా ఇలాంటి రైటర్ తిమింగళాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. ఎవరైనా కొత్త కుర్రాళ్ళ దర్శకులుగా మారి వీరిని మాటలు రాసిపెట్టమంటే మాత్రం.. ఇక టోటల్ క్రెడిట్ అంతా తమదే అన్నట్లు వీరు బిహేవ్ చేస్తుంటారు. కాని చివరకు ఎవరికి దక్కాల్సిన క్రెడిట్ వారికి కాస్త లేటుగానైనా దక్కుతుందిలే. కాకపోతే ఈలోపు కొందరు దర్శకులు సీన్ నుండి మాయమైపోతుంటారు. అదే బాధాకరం.