Begin typing your search above and press return to search.

తెలుగు స్టార్‌ రైటర్‌ కు హిందీ ఫిలింఫేర్‌

By:  Tupaki Desk   |   16 Jan 2016 6:39 AM GMT
తెలుగు స్టార్‌ రైటర్‌ కు హిందీ ఫిలింఫేర్‌
X
జీవితాంతం ఎన్నో సినిమాలకు కథలను రాసినా రానటువంటి పేరు.. ఒకే ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. అదే సినిమా పవర్‌. ఆ పవర్‌ గురించి సరిగ్గా తెలిసిన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఖచ్చితంగా రాజమౌళి ఫ్యామిలీ అనే చెప్పాలి. ఒక ప్రక్కన బాహుబలి కోసం కథను అందించిన డాడీ విజయేంద్ర ప్రసాద్‌.. తెలుగులో తీసిన సినిమాలన్నీ ఫ్లాపులే కావడంతో.. పెద్దగా పేరు తెచ్చుకోలేదు. సడన్‌ గా ఈయన ఒక కథను రాసి అది ఏకంగా సల్మాన్‌ ఖాన్‌ కు ఇచ్చేశారు. కట్‌ చేస్తే.. అదే భజరంగీ బాయ్‌జాన్‌.

ఆ సినిమా ఏ రేంజు హిట్టూ అందరికీ తెలిసిందే. పైగా ఇండియా పాకిస్తాన్‌ వంటి రెండు దేశాల మధ్యన సామరస్యాన్ని పెంపొందించిన సినిమా. అందుకే 300 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి కూడా. ఇంతటి రిలీజియస్‌ హార్మనీ కథను.. పీకూ.. వంటి సినిమాల కథలతో పోలిస్తే చాలా గొప్పదే. అందుకే ఇప్పుడు ఫిలింఫేర్‌ వారు బాలీవుడ్‌ ఫిలింఫేర్‌ 2016 అవార్డుల్లో భజరంగీ బాయ్‌జాన్‌ కతకు గాను విజయేంద్రప్రసాద్‌ కు ఉత్తమ స్టోరీ అవార్డును అందజేశారు. మన రైటర్‌ స్టామినాను వారు గుర్తించడం నిజంగానే పెద్ద విషయం. కంగ్రాట్స్‌ విజయేంద్రప్రసాద్‌ గారూ!!