Begin typing your search above and press return to search.
ట్రెండీ టాక్: యువ హీరో పై కుట్ర?
By: Tupaki Desk | 21 Dec 2018 5:32 AM GMTఈ శుక్రవారం టాలీవుడ్ లో రెండు క్రేజీ సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండిటిలో ఓ సినిమాపై ఆపోజిట్ వర్గం అభిమానుల్లో నజర్ కొనసాగుతోందని తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ హీరో సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో చెలరేగుతూ వేరొక స్టార్ హీరో కం పొలిటీషియన్ పై తీవ్రమైన కామెంట్లు చేయడంతో ఆ ప్రభావం నేడు రిలీజవుతున్న ఆ హీరో వారసుని సినిమా పై పడుతోందట. ఆ మేరకు సదరు స్టార్ హీరో అభిమాన సంఘాల్లో వాడి వేడిగా చర్చ సాగిందని తెలుస్తోంది.
తమ ఫేవరెట్ హీరో పై తీవ్రమైన కామెంట్లతో విరుచుకుపడిన సదరు హీరోగారి కుమారుని సినిమా సరిగా ఆడకుండా కుట్ర చేశారన్న చర్చ సాగడం రచ్చకెక్కుతోంది. దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లలోనూ ఆందోళన నెలకొందట. ఇప్పటికే ఇరు అభిమాన సంఘాల్లో బాహా బాహీ సాగుతోందని, ఆ ప్రభావం అంతో ఇంతో సినిమాపైనా పడుతుందని భావిస్తున్నారట.
అయితే సదరు యువహీరో సినిమాని ఈ క్రైసిస్ నుంచి కాపాడేందుకు తన వర్గం అభిమానులు కొమ్ము కాసేందుకు ఏరియాల వారీగా చర్చించడంపైనా లీకులందుతున్నాయి. సదరు పొలిటీషియన్ కం స్టార్ హీరో రకరకాల సందర్భాల్లో తమ హీరోలపై కామెంట్లు చేయడంతో దానికి ప్రతి ఎటాక్ గానే తమ హీరో సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో ఫైరయ్యారని అందుకు ప్రతిగా యువహీరో సినిమాని బలి పెట్టడం సరికాదని సదరు సంఘాలు నిర్ణయానికి వచ్చాయిట. అయితే టాలీవుడ్‌లో ఈ తరహా కుట్రలు- కుతంత్రాలు కొత్తేం కాదు. అనాదిగా నడుస్తున్నవే.
ఇటీవలి కాలంలో ఇలా బహిరంగంగానే రచ్చకెక్కడం ఏమీ బాలేదన్న ఆసక్తికర చర్చా సాగుతోంది. సదరు హీరోలు ఒకరిపై ఒకరు టీజింగ్ కామెంట్లు మానుకుంటేనే మంచిదని, వేలాది మంది ఆధారపడి జీవించే సినిమా పరిశ్రమకు ఇలాంటి అనవసర గొడవల్ని ఆపాదించడం ఎంతవరకూ సబబు? అన్న చర్చా వేడెక్కిస్తోంది.